తెలంగాణ

telangana

ETV Bharat / state

ఏపీ ఫిర్యాదుపై స్పందించిన గోదావరి నదీ యాజమాన్య బోర్డు - godavari river board about telangana projects

godavari-river-Management-board
ఏపీ ఫిర్యాదుపై స్పందించిన గోదావరి నదీ యాజమాన్య బోర్డు

By

Published : May 20, 2020, 5:58 PM IST

Updated : May 20, 2020, 8:30 PM IST

17:54 May 20

ఏపీ ఫిర్యాదుపై స్పందించిన గోదావరి నదీ యాజమాన్య బోర్డు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లేవనెత్తిన నీటిపారుదల ప్రాజెక్టులకు సంబంధించి సవివర ప్రాజెక్టు నివేదికలు సహా వివరాలు అందించాలని గోదావరి యాజమాన్య బోర్డు తెలంగాణ ప్రభుత్వాన్ని కోరింది. ఏపీ ఫిర్యాదు స్పందించిన బోర్డు... తెలంగాణ ప్రభత్వ వివరణ కోరింది. ఈ మేరకు గోదావరి బోర్డు సభ్యుడు పి.ఎస్.కుటియాల్ తెలంగాణ నీటిపారుదల శాఖ ముఖ్యకార్యదర్శి రజత్ కుమార్​కు లేఖ రాశారు.  

డీపీఆర్ సహా ఇతర వివరాలు ఇవ్వకుండా, అపెక్స్ కౌన్సిల్ అనుమతి లేకుండా తెలంగాణ ప్రభుత్వం కొత్త ప్రాజెక్టులు నిర్మిస్తోందని ఈ నెల 14న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గోదావరి బోర్డుకు లేఖ రాసింది. కాళేశ్వరం, గోదావరి ఎత్తిపోతల మూడో దశ, సీతారామ, తుపాకులగూడెం, మిషన్ భగీరథ, పెన్ గంగపై మూడు ఆనకట్టలు, రామప్ప చెరువు నుంచి పాకాలకు మళ్లింపు పథకాలను అందులో ప్రస్తావించింది.  

కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా తీసుకునే నీటిని కూడా 225 నుంచి 450 టీఎంసీలకు, సీతారామ నుంచి 70 టీఎంసీల నుంచి వంద టీఎంసీలకు పెంచారని కూడా లేఖలో పేర్కొన్నారు. 2019 ఆగస్టులో జరిగిన బోర్డు సమావేశంలోనూ ఈ ప్రాజెక్టుల అంశం చర్చకు వచ్చిందన్న బోర్డు... ప్రాజెక్టుల వివరాలు తెలంగాణ నుంచి అందాల్సి ఉందని తెలిపింది. ఆంధ్రప్రదేశ్ తాజా ఫిర్యాదు నేపథ్యంలో ప్రాజెక్ట్​ల డీపీఆర్​లు, వివరాలు అందించాలని... ఈ అంశాన్ని ప్రాధాన్యమైన అంశంగా పరిగణించాలని సూచించింది.

ఇదీ చూడండి :పోతిరెడ్డిపాడు ఎత్తిపోతలపై గ్రీన్​ ట్రైబ్యునల్​ స్టే

Last Updated : May 20, 2020, 8:30 PM IST

ABOUT THE AUTHOR

...view details