ఆగస్టు 3న గోదావరి నదీ యాజమాన్య బోర్డు సమన్వయ కమిటీ భేటీ - water disputes between telangana
20:48 July 30
ఆగస్టు 3న గోదావరి నదీ యాజమాన్య బోర్డు సమన్వయ కమిటీ భేటీ
ఆగస్టు 3న గోదావరి నదీ యాజమాన్య బోర్డు సమన్వయ కమిటీ సమావేశం కానుంది. హైదరాబాద్ జలసౌధలో సమన్వయ కమిటీ మొదటిసారి భేటీ కానుంది. కృష్ణా, గోదావరి బోర్డుల పరిధిని నిర్ణయిస్తూ కేంద్ర జల్‌శక్తి శాఖ గెజిట్ జారీ చేసిన తర్వాత మొదటిసారి కమిటీ భేటీ అవుతుంది. గెజిట్ అమలు కార్యాచరణ ఖరారుపై సమావేశంలో చర్చించనున్నట్లు సమాచారం. గోదావరి బోర్డు సభ్యులు, కేంద్ర ప్రభుత్వ ప్రతినిధి, రెండు రాష్ట్రాల ఈఎన్సీలు, జెన్‌కో, ట్రాన్స్‌కో ఎండీలు భేటీలో పాల్గొననున్నారు.
ఇదీచూడండి:CABINET MEETING: ఆగస్టు 1న కేబినెట్ భేటీ... పలు కీలకాంశాలపై చర్చ