ఈ నెల 10 వరకు కొత్త ప్రాజెక్టుల డీపీఆర్‌లు ఇవ్వాలని ఉభయ తెలుగు రాష్ట్రాలను గోదావరి బోర్డు ఆదేశించింది. టెలీమెట్రీ ఎక్కడ ఏర్పాటు చేయాలన్న విషయమై కమిటీ ఏర్పాటు చేసినట్లు బోర్డు ఛైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ చెప్పారు. పెద్దవాగు ప్రాజెక్ట్ ఆధునీకరణకు రెండు రాష్ట్రాలు అంగీకరించాయని వెల్లడించారు.
ఇరు రాష్ట్రాలు డీపీఆర్‌లు ఇవ్వాలి: గోదావరి బోర్డు - godavari river latest news
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కొత్త ప్రాజెక్టుల డీపీఆర్ ఇవ్వాలని గోదావరి బోర్డు ఆదేశించింది. హైదరాబాద్ జలసౌధలో గోదావరి యాజమాన్య బోర్డు సమావేశం జరిగింది. టెలీమెట్రీ ఎక్కడ ఏర్పాటు చేయాలన్న విషయమై కమిటీ ఏర్పాటు చేసినట్లు బోర్డు ఛైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ తెలిపారు.
ఇరు రాష్ట్రాలు డీపీఆర్‌లు ఇవ్వాలి: గోదావరి బోర్డు
అపెక్స్ కౌన్సిల్ భేటీ కోసం అజెండా ఇవ్వాలని రెండు రాష్ట్రాలను కోరామని తెలిపారు. తెలంగాణలోని కొన్ని ప్రాజెక్టులపై ఆంధ్రప్రదేశ్ అభ్యంతరాలు లేవనెత్తిందని చెప్పారు. ఏపీ అభ్యంతరాలపై స్పందించాలని తెలంగాణను కోరినట్లు పేర్కొన్నారు.
ఇదీ చదవండి:వలస గోస: బతుకు బండికి అన్నదమ్ములే కాడెడ్లు