నెల్లూరు జిల్లా చేజర్ల మండలం పుట్టుపల్లిలో దర్గా చెట్టును ఆ ఊరివారు దేవుడి చెట్టుగా భావిస్తారు. ఆ గ్రామంలో ఏ ఇంట్లో శుభకార్యం జరిగినా ఆ చెట్టుకు పూజలు చేసి జెండా ఉంచుతారు. ఇది ఆ ఊరి ఆనవాయితీ. అయితే.. తాము ఎంతో భక్తిగా కొలిచే ఈ చెట్టు ఉన్నట్లుండి ఎండిపోయిందనీ.. ఇలా జరగడం అశుభానికి ప్రతీక అని గ్రామస్థులు అంటున్నారు.
'దేవుడి చెట్టు ఎండిపోయింది.. ఏం జరుగుతుందో..!' - నెల్లూరు జిల్లాలో దర్గా చెట్టు
సాంకేతికత ఎంత అభివృద్ధి చెందుతున్నా.. ఇంకా కొన్ని గ్రామాల్లో ప్రజలు మూఢ నమ్మకాలతో వెనుకబడిపోతున్నారు. తమ ఊరిలోని దేవుడి చెట్టు ఎండిపోయిందనీ.. అలా జరగడం అరిష్టమని.. ఇప్పుడేం జరుగుతుందో అని భయపడుతున్నారు ఆ ఊరి గ్రామస్థులు. భక్తిగా కొలిచే చెట్టు ఎండిపోవడం చూసి అశుభానికి ప్రతీకగా అక్కడి వారు భావిస్తున్నారు. నెల్లూరు జిల్లా పుట్టుపల్లిలో ఎండిన దేవుని చెట్టు గురించి మనమూ తెలుసుకుందామా..!

దేవుడి చెట్టు ఎండిపోయింది
'దేవుడి చెట్టు ఎండిపోయింది.. ఏం జరుగుతుందో..!'
ఇటీవల కురిసిన వర్షాలకు చెట్టు చిగురించాలి కానీ.. ఇలా అకస్మాత్తుగా ఎండిపోవడమేంటో తమకు అర్థం కావట్లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సంఘటనతో గ్రామంలో ఏం జరుగుతుందో అని భయపడుతున్నామని తెలిపారు.
- ఇదీ చూడండి : తను కన్నవారికీ... తనను కన్నవారికీ... తనే అమ్మ!