తెలంగాణ

telangana

ETV Bharat / state

'జీవో నెం.59 అమల్లోనే ఉంది.. ఆందోళన చెందొద్దు!' - ఎస్సీ, ఎస్టీలు పారిశ్రామిక వేత్తలుగా

ఎస్సీ, ఎస్టీ కాంట్రాక్టర్లు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భారత దళిత పరిశ్రమ సమాఖ్య (సీఐడీఐ) జాతీయ అధ్యక్షులు ఎర్రతోట రాజశేఖర్ పేర్కొన్నారు. జీవో నెం.59 అమలు కావడం లేదంటూ ఇటీవల ఓ పత్రికలో వచ్చిన కథనాన్ని.. తాము తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు.

G.O No.59 is still in force .. Don't worry says cidi head rajashekhar
'జీవో నెం.59 అమల్లోనే ఉంది.. ఆందోళన చెందొద్దు!'

By

Published : Jan 27, 2021, 2:33 PM IST

రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ దళితుల అభివృద్ధి కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలను తీసుకొచ్చారని భారత దళిత పరిశ్రమ సమాఖ్య (సీఐడీఐ) జాతీయ అధ్యక్షులు ఎర్రతోట రాజశేఖర్ పేర్కొన్నారు. జీవో నెం.59 అమలు కావడం లేదంటూ ఇటీవల ఓ పత్రికలో వచ్చిన కథనాన్ని.. తాము తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. హైదరాబాద్, హైదర్​గూడలో ఏర్పాటు చేసిన ఓ సమావేశంలో ఆయన మట్లాడారు.

ప్రభుత్వం.. ఎస్సీ, ఎస్టీలను పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దేందుకు తీసుకొచ్చిన జీవో నెం.59 ద్వారా వందలాది మంది తాపీమేస్త్రీలు.. కాంట్రాక్టర్లుగా ఎదిగారని రాజశేఖర్ గుర్తుచేశారు. ఈ జీవో ద్వారా కాంట్రాక్టు పనుల్లో.. ఎస్సీలకు 15శాతం, ఎస్టీలకు 6శాతం రిజర్వేషన్​ను కల్పించిందని వివరించారు.

జీవో నెం.59ను ప్రభుత్వం అన్ని శాఖల్లో.. 80శాతం వరకు అమలు చేస్తోందని రాజశేఖర్​ పేర్కొన్నారు. ఇటీవల జరిగిన ఎన్నికలు, తదితర కారణాల వల్ల.. కొన్ని శాఖల్లో మాత్రం అమలు కావడంలేదని వివరించారు. ఆయా శాఖల్లోనూ త్వరలోనే అమలు జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి:'ఎస్సీల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నారు'

ABOUT THE AUTHOR

...view details