జీవో నంబర్ 3ని సుప్రీంకోర్టు కొట్టివేయడం వల్ల ఆదివాసీ గిరిజనుల్లో అభద్రతా భావం నెలకొందని ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు తెలిపారు. హైదరాబాద్ రాజ్‌భవన్‌లో గవర్నర్ తమిళిసై సౌందర రాజన్‌ని కలిసిన బాపురావు గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలను, జీఓ నం. 3ని సుప్రీం కొట్టివేయడం వల్ల తలెత్తుతున్న ఇబ్బందులను వివరించారు.
జీవో నం.3 యథావిధిగా కొనసాగించాలి : ఎంపీ సోయం - Governor Tamilisai Soundararajan Latest News
జీవో నంబర్ 3ని యథావిధిగా కొనసాగించాలని ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు డిమాండ్ చేశారు. హైదరాబాద్ రాజ్‌భవన్‌లో గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ను ఎంపీ సోయం కలిసి గిరిజనుల సమస్యలను వివరించారు.
ఎంపీ సోయం బాపురావు
30 ఏళ్ల నుంచి మాత్రమే అధికశాతం మంది గిరిజనులు చదువు వైపు మళ్లారని సోయం పేర్కొన్నారు. ఇప్పుడు జీవో నం.3ని కొట్టివేయడం వల్ల ఉద్యోగాలు రావనే భయంతో వారు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే రివ్యూ పిటిషన్ వేయాలని ఆయన కోరారు. రివ్యూ పిటిషన్ వేసినా న్యాయం జరగకపోతే ఆర్డినెన్స్ జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఇవీ చూడండి:క్షేత్రస్థాయిలో నిఘా: ఆ సడలింపులు ఇద్దామా? వద్దా?