తెలంగాణ

telangana

By

Published : Dec 19, 2020, 8:22 PM IST

ETV Bharat / state

'గోవును జాతీయ జంతువుగా ప్రకటించాలని ఈనెల 21న 'గో మహాధర్నా'

గోవును జాతీయ జంతువుగా ప్రకటించాలని డిమాండ్‌ చేస్తూ... ఈనెల 21న ఇందిరా పార్క్‌ వద్ద 'గో మహాధర్నా' నిర్వహించనున్నట్లు యుగ తులసి ఫౌండేషన్‌ అధ్యక్షులు ప్రకటించారు. గోహత్యలు నివారించాలని చేస్తున్న తమ ప్రయత్నానికి స్వామీజీలు, పీఠాధిపతులు మద్దతు ఇవ్వాలని కోరారు. త్వరలో నిజాం కళాశాల మైదానంలో పెద్ద ఎత్తున సభను ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు.

go-mahadharna-to-declare-wu-as-a-national-animal
గోవును జాతీయ జంతువుగా ప్రకటించాలని గో మహాధర్నా

గోమాతను జాతీయ జంతువుగా ప్రకటించాలని డిమాండ్‌ చేస్తూ... ఈనెల 21న ఇందిరా పార్క్‌ వద్ద 'గో మహాధర్నా' నిర్వహించనున్నట్లు యుగ తులసి ఫౌండేషన్‌ అధ్యక్షుడు శివకుమార్‌ తెలిపారు. గో సేన ఫౌండేషన్‌, యుగ తులసి ఫౌండేషన్‌, సంయుక్త ఆధ్వర్యంలో తలపెట్టిన ఈ మహాధర్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కనువిప్పు కలిగే విధంగా నిర్వహించబోతున్నట్లు ఆయన ప్రకటించారు.

తమ ప్రయత్నానికి స్వామీజీలు, పీఠాధిపతులు మద్దతు ఇవ్వాలని సోమాజిగూడలో నిర్వహించిన సమావేశంలో ఆయన కోరారు. గోవధ నివారించే చట్టాలు వచ్చేదాకా తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. అవసరమైతే రాష్ట్రాన్ని దిగ్బంధం చేస్తామని హెచ్చరించారు.

గోవును జాతీయ జంతువుగా ప్రకటించాలంటే ప్రధాని మోదీ నిర్ణయం తీసుకోవాలని కోరారు. మహా ధర్నా అన్ని జిల్లా కేంద్రాల్లోనూ జరగనున్నాయని... త్వరలో నిజాం కళాశాల మైదానంలో పెద్ద ఎత్తున సభను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో తులసి ఫౌండేషన్ ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి:క్షణాల్లో కారు బూడిద... తృటిలో తప్పిన ప్రాణాపాయం

ABOUT THE AUTHOR

...view details