తెలంగాణ

telangana

ETV Bharat / state

rationalization of teachers: ఉపాధ్యాయుల హేతుబద్దీకరణకు జీవో జారీ - తెలంగాణ టాప్ న్యూస్

ఉపాధ్యాయుల హేతుబద్దీకరణకు తెలంగాణ ప్రభుత్వం జీవో జారీ చేసింది. కలెక్టర్ల నేతృత్వంలో... ఐదుగురు సభ్యులతో జిల్లా స్థాయి కమిటీలను కూడా ఏర్పాటు చేసినట్లు అధికారులు చెబుతున్నారు.

go-issued-for-rationalization-of-teachers
go-issued-for-rationalization-of-teachers

By

Published : Aug 17, 2021, 12:51 PM IST

రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణకు ప్రభుత్వం జీవో జారీ చేసింది. కలెక్టర్ల నేతృత్వంలో జిల్లా స్థాయి కమిటీల ఏర్పాటుకు అధికారులు రంగం సిద్ధం చేశారు. ఐదుగురు సభ్యులతో జిల్లా స్థాయి కమిటీలను ఏర్పాటు చేశారు. పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య ఆధారంగా ఉపాధ్యాయ పోస్టులను నిర్ణయిస్తారు. ఉపాధ్యాయులు ఎక్కువగా ఉంటే వారిని ఎక్కువ మంది విద్యార్థులు, తక్కువ మంది ఉపాధ్యాయులు ఉన్న పాఠశాలకు బదిలీ చేస్తారు.

హేతుబద్ధీకరణను ప్రభుత్వం 2015లో పూర్తిచేసింది. ఆ సందర్భంగా ఇచ్చిన జీవో 11, 17ల్లో కొన్ని మార్పులుచేర్పులతో కొత్త జీవో తీసుకువచ్చింది. గత విద్యా సంవత్సరం(2020-21) జిల్లా పాఠశాల విద్యా సమాచారం(యూడైస్‌)లో నమోదైన విద్యార్థుల సంఖ్యను ఈసారి ప్రామాణికంగా తీసుకుంటారు. ఏ పాఠశాలలో ఎంతమంది విద్యార్థులున్నారు, మంజూరు పోస్టులెన్ని, పనిచేస్తున్నవారెందరు, ఖాళీలెన్ని.. తదితర వివరాలన్నింటినీ డీఈఓలు సిద్ధం చేసుకున్నారు. అవసరానికి మించి ఉపాధ్యాయులుంటే వారిని ఎక్కడికి పంపాలో కూడా జాబితా సిద్ధం చేశారు.

ప్రాథమిక పాఠశాలల్లో పనిచేసే సెకండరీ గ్రేడ్‌ టీచర్లు(ఎస్‌జీటీలు) ఎక్కువగా ఉన్నపుడు.. అలాంటి వారికి స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టుకు అవసరమైన అర్హతలుంటే ఉన్నత పాఠశాలల్లో తాత్కాలికంగా సర్దుబాటు చేయవచ్చని చెప్పినట్లు తెలిసింది. ఒక్క విద్యార్థీ లేని పాఠశాలకు సైతం ఒక ఉపాధ్యాయ పోస్టు ఉంచాలని సూచించినట్లు సమాచారం. రాష్ట్రంలో ఆంగ్లం బోధించే సబ్జెక్టు టీచర్లు అవసరానికి మించి ఉన్నట్లు చెబుతున్నారు.

ఇదీ చూడండి:KTR TWEET: బండి సంజయ్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నా... కేటీఆర్ ఆసక్తికర ట్వీట్

ABOUT THE AUTHOR

...view details