తెలంగాణ

telangana

ETV Bharat / state

'మాలే' దీవికి గో ఎయిర్​ విమానం సిద్ధం.. ప్రయాణమే ఆలస్యం.! - గో ఎయిర్​ సర్వీసు ప్రారంభం

మాల్దీవులలోని మాలే విహార యాత్రకు శంషాబాద్​ విమానాశ్రయం వేదికైంది. హైదరాబాద్​ నుంచి మాలేకు గో ఎయిర్​ విమాన సర్వీసును జీహెచ్​ఐఏఎల్ ప్రారంభించింది. వారంలో నాలుగు రోజులు ఈ సర్వీసు నడపనున్నట్లు జీఎంఆర్​ అధికారులు తెలిపారు. సాహస ప్రియులు, ప్రకృతి ప్రేమికులకు ఈ ప్రయాణం మంచి అనుభూతినిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

go air, hyderabad male
హైదరాబాద్​ మాలే, గో ఎయిర్​

By

Published : Feb 12, 2021, 4:42 PM IST

Updated : Feb 12, 2021, 5:15 PM IST

జీఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్(జీహెచ్​ఐఏఎల్​) గురువారం.. హైదరాబాద్ నుంచి మాల్దీవులలోని మాలేకు గో ఎయిర్ విమాన సర్వీసును ప్రారంభించింది. ఈ విమానం ఉదయం 11. 40 గంటలకు శంషాబాద్​ విమానాశ్రయం నుంచి మాలేకు బయలుదేరింది. గో ఎయిర్ ద్వారా అంతర్జాతీయ సర్వీసులకు ఈ-బోర్డింగ్‌ను ఉపయోగించుకోవడం ప్రారంభించింది. జీఎంఆర్ హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చెందిన సీనియర్ అధికారులు, గో ఎయిర్ అధికారులతో పాటు, ఇతర విమానాశ్రయ భాగస్వాములు.. టెర్మినల్ వద్ద ప్రయాణికులు, సిబ్బందికి వీడ్కోలు పలికారు.

విమాన సర్వీసును ప్రారంభిస్తున్న అధికారులు

వారంలో నాలుగు రోజులు

గో ఎయిర్ విమానం జీ8 1533 ఉదయం 11.30 గంటలకు హైదరాబాద్ విమానాశ్రయం నుంచి బయలుదేరి మధ్యాహ్నం 1.30 గంటలకు మాల్దీవులలోని వెలానా అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో 2.30 గంటలకు మాలే నుంచి బయలుదేరి సాయంత్రం 5.30 గంటలకు హైదరాబాద్ చేరుకుంటుంది. ఇరు ప్రాంతాల మధ్య వారంలో సోమ, మంగళ, గురు, శనివారాల్లో విమానాలు నడుస్తాయి.

హైదరాబాద్​ టు మాలే గో ఎయిర్​ విమానం
మొదటి ప్రయాణానికి ఎదురుచూస్తున్న ప్రయాణికులు

మంచి అనుభూతి

హైదరాబాద్, మాలేలను కలిపే ఈ నూతన సర్వీసు కోసం ప్రయాణికులు ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్నారని జీహెచ్​ఐఏఎల్​ సీఈఓ ప్రదీప్​ పణికర్​ తెలిపారు. సాహస ప్రియులు, ప్రకృతి ప్రేమికులు, సెలవులకు వెళ్లే వారు ఈ ప్రయాణాన్ని ఎంతో ఇష్టపడతారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సర్వీసు చాలా కాలం ఉంటుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. అన్ని అంతర్జాతీయ గమ్యస్థానాలకు సర్వీసులను ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు.

విహార యాత్రకు బయలుదేరే ముందు సరదాగా కెమెరా క్లిక్​

హైదరాబాదీల కోసం గో ఎయిర్ ఈ ప్రత్యేక సర్వీసును ప్రారంభించింది. మాలేకు వెళ్లే ప్రయాణికులకు ఈ సర్వీసు ద్వారా వారికి ప్రయాణ అనుభవం మరింత ఆనందదాయకంగా, సౌకర్యవంతంగా మారుతుంది. ఈ అవకాశం కల్పించిన జీఎంఆర్ విమానాశ్రయాలు, సివిల్ ఏవియేషన్ మంత్రిత్వ శాఖ, సంబంధిత విభాగాలకు, భాగస్వాములకు కృతజ్ఞతలు.’ హైదరాబాద్.. దక్షిణ మధ్య భారతదేశానికి ప్రవేశ ద్వారం లాంటిది. అలాగే అతిపెద్ద రవాణా కేంద్రం. ఇటీవల ప్రయాణికుల కోరిక మేరకు హైదరాబాద్ విమానాశ్రయం.. చికాగోకు 'నాన్ స్టాప్ ఫ్లైట్​' సర్వీసునూ ప్రారంభించింది.

శ్రీ కౌశిక్ ఖోనా, గో ఎయిర్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్

పాస్​పోర్టు తనిఖీ చేస్తున్న సిబ్బంది

గో ఎయిర్‌ను 'స్మార్ట్ పీపుల్స్ ఎయిర్‌లైన్'గా, 'సమయస్ఫూర్తి, స్థోమత, సౌలభ్యం' అనే సూత్రాలతో రూపుదిద్దుకుందని అధికారులు తెలిపారు. మాల్దీవులులో గడపడానికి హనీమూన్​కు వెళ్లే జంటలు అధిక ప్రాధాన్యతనిస్తారని చెప్పారు. మాలేలోని కృత్రిమ బీచ్‌లో కయాకింగ్, వేక్‌బోర్డింగ్, స్కూబా డైవింగ్, కాటమరాన్ సెయిలింగ్ వంటి ఆకర్షణీయమైన జల క్రీడా కార్యకలాపాలను ఆస్వాదించవచ్చు.

ఇదీ చదవండి:విద్యారంగానికి అన్ని విధాల కృషి: హరీశ్​ రావు

Last Updated : Feb 12, 2021, 5:15 PM IST

ABOUT THE AUTHOR

...view details