GO 46 Controversy Telangana : రాష్ట్రంలో ఉద్యోగ నియామకాలకు సంబంధించి జీవో నంబర్ 46 వివాదం రాజేస్తోంది. జీవోలోని కంటీజియస్ డిస్ట్రిక్ట్ కేడర్ అంశంపై ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఇది 9 శాఖలకు సంబంధించినదైనా.. తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక పోలీసు ఉద్యోగాల భర్తీ చుట్టే కేంద్రీకృతమైంది. రెవెన్యూ జిల్లాల జనాభాను ప్రాతిపదికగా చేసుకొని టీఎస్ఎస్పీ పోస్టుల్ని కేటాయిస్తే గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతిభావంతులకు అన్యాయం జరుగుతోందనేది వారి ప్రధాన ఆందోళన.
Telangana GO 46 Controversy :కటాఫ్ మార్కుల్లో వ్యత్యాసం కారణంగా రాజధాని ప్రాంతానికే ఎక్కువ ఉద్యోగాలు దక్కుతాయని చెబుతున్నారు. టీఎస్ఎస్పీ పోస్టులు రాష్ట్రస్థాయివి కావడంతో కటాఫ్ మార్కులను సైతం రాష్ట్రస్థాయిలోనే పరిగణించాలని డిమాండ్ చేస్తున్నారు. టీఎస్ఎస్పీ నియామకాల్లో జీవో నంబరు 46ను మినహాయించకుంటే ఆందోళన ఉద్ధృతం చేస్తామని స్పష్టం చేస్తున్నారు.
TSSP Constable GO 46 Issue : తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీసు నియామక మండలి- టీఎస్ఎల్పీఆర్బీనియామక ప్రక్రియలో భాగంగాత్వరలో (TSPSC Notifications 2023)టీఎస్ఎస్పీకి సంబంధించి 5వేల 10 పోస్టుల తుది ఫలితాలను వెల్లడించబోతున్నారు. అయితే కొత్త జిల్లాల ప్రకారం ఉద్యోగుల భర్తీ జరగాలన్న రాష్ట్రపతి ఉత్తర్వుల కారణంగా తెరపైకి వచ్చిన సీడీసీ అంశం తాజా వివాదానికి కేంద్రమైంది. టీఎస్ఎస్పీ బెటాలియన్లు అన్ని జిల్లాల్లో లేని కారణంగా పొరుగునే ఉన్న మూడు, నాలుగు జిల్లాలను కలిపి సీడీసీ క్యాడర్‌ను నిర్ణయించారు. ఈ ప్రాతిపదికన పోస్టుల్ని కేటాయించేందుకు ప్రభుత్వం జీవో నంబరు 46ను జారీ చేసింది. దీని ప్రకారం రెవెన్యూ జిల్లాలవారీగా జనాభాను పరిగణనలోకి తీసుకుని పోస్టులను భర్తీ చేయనుండటం వివాదాన్ని రాజేస్తోంది.
GO 46 issue in Telangana : జీవో46పై అభ్యర్థుల ఆందోళనలు.. రద్దు చేయాలని డిమాండ్