తెలంగాణ

telangana

ETV Bharat / state

ఇంటర్ తర్వాత కొత్త రూట్​లో వెళ్లాలనుకునే వారి కోసం - జీఎంఆర్ స్కూల్ ఆఫ్ ఏవియేషన్ - జీఎంఆర్ స్కూల్ ఆఫ్ ఏవియేషన్

GMR School of Aviation in Hyderabad : పది తర్వాత ఇంటర్. మరి ఇంటర్ తర్వాతేంటి? ప్రతి విద్యార్థి జీవితంలో ఈ రెండు చోట్ల ఆలోచనలో పడతాడంటే అతిశయోక్తి కాదు. అయితే కొంతకాలంగా ఇంటర్‌లో ఎంపీసీ, ఆ తర్వాత బీటెక్‌. చివరికి సాఫ్ట్‌వేర్‌. మీరు ఇందుకు భిన్నంగా ఏదైనా చేయాలనుకుంటే ఈ కోర్సు గురించి తెలుసుకోవాల్సిందే. కొత్తగా ఆలోచించే వారికోసం సరికొత్తగా ఏవియేషన్ స్కూల్‌ని అందుబాటులోకి తెచ్చింది జీఎంఆర్. మరి అక్కడేం నేర్పిస్తారు? ఆ కోర్సుల వల్ల ఎలాంటి ప్రయోజనాలుంటాయి? ఇప్పుడు చూద్దాం.

GMR School of Aviation
GMR School of Aviation

By ETV Bharat Telangana Team

Published : Jan 14, 2024, 2:50 PM IST

హైదరాబాద్‌లో జీఎంఆర్‌ స్కూల్‌ ఆఫ్ ఏవియేషన్‌

GMR School of Aviation in Hyderabad : జీఎంఆర్ ఈ పేరు చెప్పగానే ముందుగా గుర్తొచ్చేది శంషాబాద్‌లోని విమానాశ్రయం. అయితే అదే జీఎంఆర్ ఓ కేంద్రంలో విమానాల రిపేర్, మెయింటెనెన్స్ సైతం చేస్తోంది. ఏటా భారత విమానయాన రంగం సుమారు 20 శాతం పైగా వృద్ధి సాధిస్తుంది. ఈ నేపథ్యంలో అందుకు తగిన విధంగా నైపుణ్యం కలిగిన ఏయిర్‌క్రాఫ్ట్ మెయింట్‌నెన్స్ సిబ్బందికి డిమాండ్ పెరగనుంది. దీన్ని భర్తీ చేసేందుకు సరికొత్తగా ఆలోచించి విద్యార్థుల కోసం స్కూల్‌ను అందుబాటులోకి తీసుకువస్తోంది ఈ సంస్థ.

Aircraft Maintenance Engineering in Hyderabad :శంషాబాద్‌ విమానాశ్రయం ప్రాంగణంలో ఏవియేషన్‌ స్కూల్‌ను ప్రారంభించింది జీఎంఆర్. స్కూల్ ఆఫ్ ఏవియేషన్ (GMR School of Aviation) పేరుతో ఇంజినీరింగ్ ప్రోగ్రాం కోర్స్‌లు అందించనుంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచే తరగతులు ప్రారంభించేందుకు సంస్థ సన్నాహాలు చేస్తుంది. విమానాల మెయింట్‌టెనెన్స్‌కి సంబంధించిన ఈ కోర్సులో చేరేందుకు, ఇంటర్ ఎంపీసీలో కనీసం 50 శాతం ఉత్తీర్ణత తప్పని సరిని చెబుతున్నారు.

"ఏవియేషన్ స్కూల్‌ను జీఎంఆర్‌ సంస్థ ఏర్పాటు చేసింది. నాలుగేళ్ల సమీకృత ఇంజినీరింగ్‌ కోర్సు ఉంటుంది. ఏఎంఈ కోర్సులో విద్యార్థులకు రెండేళ్లు తరగతులు నిర్వహిస్తాం. మరో రెండేళ్లు ప్రయోగాత్మక శిక్షణ ఉంటుంది. ఎయిర్ బస్ సహా భిన్న రకాల ఎయిర్‌క్రాఫ్ట్‌ల పనితీరు, వాటిల్లో తలెత్తే లోపాలు ఎలా గుర్తించాలి వాటిని ఏవిధంగా పరిష్కరించాలి వంటి అంశాలపై వారికి శిక్షణ ఇవ్వనున్నాం." - అశోక్ గోపీనాథ్, జీఎంఆర్ ఏరోటెక్ అధ్యక్షుడు

GMR School in Hyderabad :మెకానికల్, ఎలక్టానిక్స్ విభాగాల్లో మెరుగైన శిక్షణ ఇవ్వటం ద్వారా, రెండు భిన్న రంగాలపై విద్యార్థులకు పట్టు లభిస్తుందని చెబుతున్నారు నిర్వాహకులు. ఈ శిక్షణలు పొందే విద్యార్థులకు కోర్సు పూర్తైన తర్వాత లైసెన్స్‌ని సైతం అందించనున్నారు. భారత డీజీసీఏ సహా యూరోపియన్ యూనియన్ ఎలివేషన్ సేఫ్టీ ఏజెన్సీ ఈఏఎస్‌ఏకి సంబంధించిన లైసెన్స్‌లను అందించనున్నారు.

AI Technology: ఆవిష్కరణల హేళ.. 'ఏఐ'తో భళా.. అద్భుతాలు సాధిస్తున్న ఇంజినీరింగ్‌ విద్యార్థులు

విద్యార్థులు కోర్సులో చేరినప్పుడే ఏ రకం లైసెన్స్ కావాలనుకుంటున్నారో చెప్పాల్సి ఉంటుంది. ఫలితంగా వారికి దానికి తగిన శిక్షణ ఇస్తామంటున్నారు జీఎంఆర్ ప్రతినిధులు. డీజీసీఏ సర్టిఫికెట్ పొందినవారు దేశంలో ఎక్కడైనా ప్లేస్‌మెంట్ పొందొచ్చని అధికారులు అంటున్నారు. ఈఏఎస్‌ఏ సర్టిఫికెట్ పొందిన వారు అంతర్జాతీయస్థాయిలో ఉపాధి అవకాశాలు పొందవచ్చని వివరిస్తున్నారు.

ఏవియేషన్ రంగంలో (Aviation)ప్రపంచంలోనే భారత్ అగ్రస్థానం చేరేందుకు దూసుకుపోతున్న తరుణం ఇది. ఇలాంటి తరుణంలో ఈ కోర్సులు యువతకు ఎంతగానో ఉపయోగపడే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇక ఈ విద్యా సంవత్సరం నుంచి తరగతులు ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రవేశ పరీక్ష ద్వారా విద్యార్థులను ఎంపిక చేస్తారు. మరిన్ని వివరాలకు www.gmrschool of aviation.comను సంప్రదించాలని నిర్వాహకులు చెబుతున్నారు.

రిక్షావాలా టు క్యాబ్ కంపెనీ ఓనర్​- ఇంటర్​ చదివి ఐఐటీయన్లకు ఉద్యోగాలు- ఈయన సక్సెస్​ స్టోరీ అదుర్స్

పైలట్‌ కల నెరవేర్చుకోబోతున్న పేదింటి అమ్మాయి ఎన్ని అడ్డంకులు వచ్చినా వెనక్కి తగ్గలేదు

ABOUT THE AUTHOR

...view details