ghmc mayor respond bjp attack: నగరంలో తెరాస ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకే భాజపా కార్పొరేటర్లు జీహెచ్ఎంసీ కార్యాలయంపై దాడి చేశారని నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి ఆరోపించారు. జీహెచ్ఎంసీ కార్యాలయంపై జరిగిన దాడిని ఆమె తీవ్రంగా ఖండించారు. భాజపా కార్పొరేటర్లు ప్రజల ఆస్తిని ధ్వంసం చేశారని మేయర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ వల్లే కౌన్సిల్ సమావేశం నిర్వహించలేకపోయామని ఆమె తెలిపారు.
ఎవరి ఆదేశాలతో తన కార్యాలయంపై దాడి చేశారని కార్పొరేటర్లను మేయర్(ghmc mayor on bjp corporaters) ప్రశ్నించారు. భాజపా కార్పొరేటర్లు ఏ ప్రశ్న అడిగినా తాను సమాధానం ఇచ్చానని తెలిపారు. జీహెచ్‌ఎంసీలోని అన్ని డివిజన్లలో తాను పర్యటించానని వెల్లడించారు. కరోనా వల్ల వర్చువల్ సమావేశాలు నిర్వహించామని.. వారు తన వద్దకు వచ్చి ఏ సమస్య ఉన్నా అడగవచ్చని సూచించారు. నిరసనల పేరుతో విధ్వంసానికి పాల్పడితే ఊరుకోమని విజయలక్ష్మి హెచ్చరించారు.
అది ప్రజల సొమ్ము
జీహెచ్ఎంసీ కార్యాలయానికి వచ్చి కుర్చీలు (bjp attack on ghmc office)ధ్వంసం చేయడం సరికాదని ఆమె హితవు పలికారు. జీహెచ్‌ఎంసీలోని వస్తువులు ప్రజల సొమ్ము అని తెలిపారు. భాజపా కార్యాలయం వద్ద ధర్నాకు తెరాస కార్పొరేటర్లు కూడా సిద్ధమయ్యారని వివరించారు. జీహెచ్‌ఎంసీలో అభివృద్ధి పనులు చాలా బాగా జరుగుతున్నందువల్లే స్వచ్ఛ సర్వేక్షణ్‌లో అవార్డులు కూడా వచ్చాయని పేర్కొన్నారు. పార్టీలకు అతీతంగా వచ్చి పనులు అడిగితే చేస్తున్నామని మేయర్ వెల్లడించారు. అధిష్ఠానం సూచన మేరకే భాజపా కార్పొరేటర్లు విధ్వంసానికి దిగారా(ghmc mayor on bjp) అని ప్రశ్నించారు. కుర్చీలు ధ్వంసం చేయడాన్ని భాజపా కార్పొరేటర్ల విజ్ఞతకే వదిలేస్తున్నానని అన్నారు. ప్రజల సమస్యను తన దృష్టికి ఎప్పుడైనా తీసుకురావొచ్చని.. కౌన్సిల్ సమావేశంలోనే అడగాలనే నియమం లేదని సూచించారు.
అసలు ఊహించలేదు