దక్షిణ మధ్య రైల్వే స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఫిట్ ఇండియా సైక్లోథాన్ కార్యక్రమాన్ని దక్షిణ మధ్య రైల్వే జీఎం గజానన్ మాల్యా జెండా ఊపి ప్రారంభించారు.
రోజు సైక్లింగ్ చేయడం ఆరోగ్యానికి చాలా మంచిదని.. తద్వారా పర్యావరణాన్ని కూడా పరిరక్షించవచ్చని జీఎం తెలిపారు. అనేక దేశాల్లో ఫిట్నెస్ కోసం సైక్లింగ్‌కు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని ఆయన వివరించారు.