తెలంగాణ

telangana

ETV Bharat / state

ఘనంగా ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం - రాష్ట్ర ఫోటో జర్నలిస్టుల అసోసియేషన్

హైదరాబాద్ బషీర్​బాగ్​లోని దేశోద్ధారక భవన్​లో రాష్ట్ర ఫోటో జర్నలిస్టుల అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన  ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ముఖ్య అతిథిగా రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి డాక్టర్ బి.జనార్దన్ రెడ్డి హాజరైయ్యారు.

ఘనంగా ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం

By

Published : Aug 19, 2019, 10:42 PM IST

రాష్ట్ర ఫోటో జర్నలిస్టుల అసోసియేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్ బషీర్​బాగ్​లోని దేశోద్ధారక భవన్​లో ఏర్పాటుచేసిన ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి డాక్టర్ బి.జనార్దన్ రెడ్డి ఫోటో ఎగ్జిబిషన్​ను ప్రారంభించారు. అక్కడ ఏర్పాటుచేసిన ఛాయచిత్ర ప్రదర్శనను తిలకించారు. వాస్తవాలను ఫోటోలో చిత్రీకరించి కళ్లకు కట్టినట్టు చూపిస్తున్న ప్రతి ఒక్క ఫోటోగ్రాఫర్​కి ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా జర్నలిస్ట్ పిల్లలకు ప్రైవేటు విద్య సంస్థల్లో ఉచిత విద్యను అందించేందుకు కృషి చేయాలని రాష్ట్ర యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఆధ్వర్యంలో జనార్దన్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు.

ఘనంగా ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం

ABOUT THE AUTHOR

...view details