దసరా ఉత్సవాల్లో భాగంగా ఏపీలోని కర్నూలు జిల్లా మద్దికేరలో గుర్రాల పార్వేట వేడుకలు ఘనంగా జరిగాయి. ఎన్నో ఏళ్లుగా సంప్రదాయంగా వస్తున్న ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు ప్రజలు వేలాదిగా తరలివచ్చారు. మద్దికేరను పాలించిన యాదవ రాజవంశీకులు పూజలు నిర్వహించిన అనంతరం పార్వేట వేడుకలు మొదలవుతాయి. అనంతరం మూడు వర్గాలకు చెందిన వారు మద్దికెర నుంచి మాజరా గ్రామమైన బొజ్జ నాయునిపేట వరకు గుర్రాల పోటీలను నిర్వహిస్తారు. ఈ వేడుక ఏపీలో మరెక్కడా లేకపోవడం విశేషం. ఈ వేడుకను విజయదశమి రోజున నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.
ఘనంగా గుర్రాల పార్వేట వేడుకలు - dussara at karnool
కర్నూలు జిల్లా మద్దికేరలో గుర్రాల పార్వేట వేడుకలు ఘనంగా జరిగాయి. దసరా ఉత్సవాల్లో భాగంగా గుర్రాల పార్వేట వేడుకలు నిర్వహించడం ఇక్కడ ఆనవాయితీ.
![ఘనంగా గుర్రాల పార్వేట వేడుకలు glorious-horse-parade-ceremonies-at-madhikera](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9309550-935-9309550-1603635070408.jpg)
ఘనంగా గుర్రాల పార్వేట వేడుకలు