తెలంగాణ

telangana

ETV Bharat / state

వైభవోపేతంగా కొనసాగుతున్న ధనుర్మాస ఉత్సవాలు - హైదరాబాద్​ వార్తలు

ధనుర్మాస ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నామని ఈఎస్​ఐలోని విజయలక్ష్మి దేవాలయం ప్రధాన అర్చకులు గట్టు అరుంధతి రంగాచార్యులు అన్నారు. గత నెలలో ప్రారంభమైన ఈ ఉత్సవాలు జనవరి 15 వరకు కొనసాగుతాయని తెలిపారు. శనివారం నిర్వహించిన ప్రత్యేక ఉత్సవాల్లో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని శ్రీ లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రం పారాయణం చేశారు.

dhanurmasa celebrations
ధనుర్మాస ఉత్సవాలు

By

Published : Jan 2, 2021, 7:11 PM IST

ధనుర్మాస ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నామని హైదరాబాద్​ ఈఎస్​ఐలోని విజయలక్ష్మి దేవాలయ ప్రధాన అర్చకులు గట్టు అరుంధతి రంగాచార్యులు అన్నారు. గత నెలలో ప్రారంభమైన ఈ ఉత్సవాలు జనవరి 15 వరకు కొనసాగుతాయని తెలిపారు.

శనివారం నిర్వహించిన ప్రత్యేక ఉత్సవాల్లో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని శ్రీ లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రం పారాయణం చేశారు. గోదాదేవికి ప్రత్యేక కుంకుమార్చనలు నిర్వహించారు. ధనుర్మాస ఉత్సవాల్లో ప్రతి రోజు గోదాదేవికి అదే విధంగా వెంకటేశ్వర స్వామికి ప్రత్యేకమైన పూజలు నిర్వహిస్తున్నామని తెలిపారు. నిత్యం భక్తులు పెద్ద ఎత్తున పాల్గొంటున్నారని అన్నారు.

ఇదీ చదవండి:'రైతు ఉద్యమం స్ఫూర్తిదాయకం.. అండగా నిలుస్తాం'

ABOUT THE AUTHOR

...view details