తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు హైదరాబాద్ నగరంలో ఘనంగా జరిగాయి. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో మేయర్ బొంతు రామ్మోహన్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్, కమిషనర్ లోకేష్ కుమార్, ఈవీడీఎం డైరెక్టర్ విశ్వజిత్, ఇతర అధికారులు పాల్గొన్నారు. తార్నాక హెచ్ఎండీఏ కార్యాలయంలో పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్ కుమార్ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. బేగంపేట్‌లోని మెట్రో రైల్ భవన్‌లోని కార్యాలయంలో మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు.
హైదరాబాద్‌లో ఘనంగా ఆవిర్భావ వేడుకలు - జీహెచ్ఎంసీ కార్యాలయంలో రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు
హైదరాబాద్ నగర వ్యాప్తంగా రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి. నగరంలోని వివిధ ప్రాంతాల్లో ప్రముఖులు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి అవతరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో మేయర్ బొంతు రామ్మోహన్, మెట్రో కార్యాలయంలో మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డిలు జాతీయ పతాకాలను ఆవిష్కరించారు.

హైదరాబాద్‌లో ఘనంగా ఆవిర్భావ వేడుకలు