ఈ 88753 51555 నంబర్‌కు మిస్డ్ కాల్ ఇస్తే మీ ఇంటి వద్దకే పండ్లు వస్తాయని మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి తెలిపారు. కావాల్సిన పరిణామం, చిరునామా సంక్షిప్త సందేశం చేసినట్లైతే మీ ఇంటి ముందుకు పండ్లు వస్తాయన్నారు. ఇప్పటికే 30 వేల కుటుంబాలకు తాజా పండ్లు సరఫరా చేశామన్నారు. లాక్‌డౌన్ కారణంగా వాక్ ఫర్ వాటర్ సంస్థతో రాష్ట్ర ప్రభుత్వం ఫామ్ టూ హోం సేవలు ప్రశంసనీయమని కొనియాడారు. జంట నగరవాసుల నుంచి విశేష ఆదరణ లభిస్తోందని ప్రకటించారు. ఈ మేరకు మంత్రి ఓ ప్రకటన విడుదల చేశారు.
30 ఆర్డర్లు ఇస్తే ఇంటికే ఉచిత సరఫరా..
రూ. 300కే మామిడి-1.5 కేజీలు, బొప్పాయి-3 కేజీలు, నిమ్మ-12 కాయలు, పుచ్చకాయలు-3 కేజీలు, బత్తాయి-2 కేజీలు, సపోట-1 కేజీ పండ్లు 72 గంటల వ్యవధిలో ఇంటి ముందుకే తీసుకొస్తారని తెలిపారు. 30 ఆర్డర్లు ఇస్తే ఇంటికే ఉచిత సరఫరా చేస్తారన్నారు. ఒక్కటే ఆర్డరైతే 10 కిలోమీటర్ల పరిధిలో రూ. 10 నుంచి 30 వరకు ఛార్జీ వసూలు చేస్తారన్నారు. రైతుగా రైతుల కష్టాలు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు తెలుసన్నారు. నాకూ కూడా తెలుసని చెప్పారు.