రాష్ట్ర వ్యాప్తంగా పట్టణప్రగతి కార్యక్రమం చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వం... పురపాలికల వారీగా బడ్జెట్ రూపకల్పనకు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు బడ్జెట్ ప్రతిపాదనల తయారీకి పురపాలకశాఖ సంచాలకులు మార్గదర్శకాలు ఇచ్చారు.
పురపాలక చట్టంలో పొందుపర్చిన ప్రకారం బడ్జెట్ ప్రతిపాదనలు రూపొందించాలని స్పష్టం చేశారు. పురపాలికకు సంబంధించిన సొంత ఆదాయాలు, ఇతర నిధులు, అన్ని రకాల వ్యయాలను అందులో పొందుపర్చాల్సి ఉంటుంది. చట్టంలో పేర్కొన్న ప్రకారం బడ్జెట్లో విధిగా పదిశాతం నిధులను గ్రీన్ బడ్జెట్‌కు కేటాయించాలని సూచించారు. ఆ నిధులతోనే పురపాలికకు సంబంధించిన హరిత ప్రణాళికను అమలు చేయాలన్నారు.