తెలంగాణ

telangana

ETV Bharat / state

రోడ్డు ప్రమాదంలో రెండో తరగతి విద్యార్థిని మృతి - Rishitha

హైదరాబాద్ కూకట్​పల్లిలో విషాదం చోటుచేసుకుంది. ఆస్బెస్టాస్ ఏవీబీపురంలో స్కూల్ నుంచి ఇంటికి తిరిగి వెళుతున్న చిన్నారిని బోలెరో వాహనం ఢీ కొట్టింది. ఈ ఘటనలో బాలిక అక్కడికక్కడే మృతిచెందింది.

బొలెరో వాహనం ఢీకొని బాలిక మృతి

By

Published : Sep 19, 2019, 10:17 PM IST

బొలెరో వాహనం ఢీకొని బాలిక మృతి

కూకట్‌పల్లి పరిధిలోని ఏవీబీపురంలో గురువారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ చిన్నారి మృతి చెందింది. పాఠశాలకు వెళ్లిన విద్యార్థిని రిషిత ఇంటికి తిరిగి వస్తుండగా బొలెరో వాహనం ఢీకొట్టటం వల్ల అక్కడికక్కడే మరణించింది. రిషిత సెయింట్ రిటా హైస్కూల్‌లో రెండో తరగతి చదువుతోందని పోలీసులు తెలిపారు. చిన్నారి మృతితో తల్లిదండ్రులు, బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details