తెలంగాణ

telangana

ETV Bharat / state

డోలీలో ఆసుపత్రికి తరలింపు.. మధ్యలోనే ప్రసవం... - ap news

ఏపీ విజయనగరం జిల్లా మారిక గిరిజన గ్రామానికి చెందిన గర్భిణిని డోలిలో ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే ప్రసవించింది. ఒక మగ బిడ్డకు జన్మనివ్వగా.. వారిద్దరూ ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

marika girijana village
మారిక గిరిజన గ్రామం

By

Published : Feb 25, 2021, 9:54 AM IST

ఆంధ్రప్రదేశ్​లోని విజయనగరం జిల్లా వేపాడ మండలం మారిక గిరిజన గ్రామానికి చెందిన గర్భిణిని.. డోలిలో ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే ప్రసవించింది. కరకవలస పంచాయతీ శివారు గిరిజన గ్రామమైన మారిక.. కొండల నడుమ ఉంటుంది. వీరు కనీస అవసరాలు తెచ్చుకోవడానికైనా ఏడు కిలోమీటర్లు దూరం నడిచి వెళ్లాల్సి ఉంటుంది.

గ్రామానికి చెందిన గమ్మెల బిమలకు పురిటినొప్పులు రావడంతో స్థానికులు డోలి కట్టి ఆస్పత్రికి తరలిస్తుండగా దారిలోనే నొప్పులు ఎక్కువై ప్రసవించింది. ఒక మగ బిడ్డకు జన్మనిచ్చింది. తర్వాత తల్లీబిడ్డలను మోసుకుంటూ తీసుకెళ్లి.. ఆటోలో ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారిద్దరూ చికిత్స పొందుతున్నారు.

ఇదీ చదవండి:వేధింపుల కాల్​తో బయటపడ్డ అతిపెద్ద సైబర్​క్రైం..!

ABOUT THE AUTHOR

...view details