GIG Jobs In E-Commerce Sector :టీమ్‌లీజ్ సర్వీసెస్ అనే మానవ వనరుల సంస్థ నిరుద్యోగులకు గుడ్‌న్యూస్ చెప్పింది. రాబోతున్న పండుగల సీజన్‌లో దక్షిణ భారతదేశంలోని నగరాల్లో ఈ-కామర్స్ రంగంలో 4 లక్షల కొత్త ఉద్యోగాలు లభించే అవకాశం ఉందని వెల్లడించింది. మార్కెట్ సెంటిమెంట్, పరిశ్రమ వర్గాల నుంచి సేకరించిన సమాచారం తదితర అంశాల ఆధారంగా ఈ అంచనా వేసినట్లు స్పష్టం చేసింది.
4 Lakh GIG Jobs in E-Commerce in South India: ఇందులో అత్యధికంగా బెంగళూరులో 40 శాతం, తదుపరి స్థానాల్లో హైదరాబాద్(30 శాతం), చెన్నై(30 శాతం)ల్లో ఉద్యోగ అవకాశాలు ఉంటాయని తెలిపింది. ఇదే సమయంలో కేవలం ప్రథమ శ్రేణి నగరాలకే ఈ-కామర్స్ గిరాకీ పరిమితం కాదని, ద్వితీయ శ్రేణి నగరాలకూ ఈ-కామర్స్ సేవలను విస్తరిస్తున్నట్లు అంచనా వేసింది. దీనివల్ల ద్వితీయశ్రేణి నగరాల్లోనూ కొత్త ఉద్యోగాలు లభించే అవకాశం ఉన్నట్లు చెబుతోంది.
AIATSL Job News Today : పదో తరగతి అర్హతతో.. 998 హ్యాండీమ్యాన్, ఏజెంట్ ఉద్యోగాలు.. అప్లై చేసుకోండిలా!
GIG Jobs In E-Commerce Hyderabad :త్వరలో రానున్న వినాయక చవితితో ప్రస్తుత పండుగల సీజన్ ప్రారంభమై.. నవంబర్ నెలలో వచ్చే దీపావళితో ముగుస్తుంది. ఈ-కామర్స్‌లో లభించే ఉద్యోగాలు ప్రధానంగా గిగ్ (డెలివరీ పార్ట్‌నర్లు, కాల్ సెంటర్లు, గోదాముల నిర్వహణ పనుల్లో నిమగ్నమయ్యే వారు) విభాగానికి చెంది ఉంటాయని టీమ్‌లీజ్ సర్వీసెస్ వెల్లడించింది.
దేశవ్యాప్తంగా 7 లక్షల 'గిగ్' ఉద్యోగాలు.. : ఈ పండుగల సీజన్ కోసం గత 3 నెలలుగా ఈ-కామర్స్ సంస్థలు పెద్దఎత్తున సన్నాహాలు చేస్తున్నాయని, దీనికి తోడు ప్రభుత్వ విధానాలు, వినియోగదారుల సెంటిమెంట్, డిజిటలీకరణ ఈ రంగానికి కలిసొస్తున్నట్లు టీమ్‌లీజ్ సర్వీసెస్ ఉపాధ్యక్షుడు ఎ.బాల సుబ్రమణియన్ తెలిపారు. అందువల్లే గతేడాదితో పోల్చితే.. ఈసారి దేశ వ్యాప్తంగా 'గిగ్' ఉద్యోగాల్లో 25 శాతం వృద్ధి ఉంటుందని అంచనా వేస్తున్నట్లు వివరించారు. అదే సమయంలో దక్షిణాది నగరాల్లో దీని కంటే మిన్నగా 30 శాతం వృద్ధి నమోదు కావొచ్చని చెప్పారు. దేశ వ్యాప్తంగా దాదాపు 7 లక్షల 'గిగ్' ఉద్యోగాలు లభించే అవకాశం ఉందని అంచనా వేశారు. ఈ-కామర్స్‌తో పాటు రిటైల్, లాజిస్టిక్స్, ఎఫ్‌ఎంసీజీ రంగాల్లో కొత్త ఉద్యోగాలు లభిస్తాయని అన్నారు.