తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ జన్మదినం సందర్భంగా ఆయనకు శుభాకాంక్షల వెల్లువ కొనసాగింది. సినీ, రాజకీయ ప్రముఖులతో పాటు వివిధ రంగాలకు చెందిన వారు, ఆయన అభిమానులు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. గిఫ్ట్ ఏ స్మైల్ ఛాలెంజ్‌ను ప్రేరణగా తీసుకుని సినీ, రాజకీయ ప్రముఖులు, కార్యకర్తలు, అభిమానులు సమాజానికి ఉపయోగపడే పనులు చేశారు. గిఫ్ట్ ఏ స్మైల్ హ్యష్ ట్యాగ్‌తో పలువురికి ఛాలెంజ్ విసురుతున్నారు.
మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు, ఇతర రాజకీయ ప్రముఖులతో పాటు మెగాస్టార్ చిరంజీవి, మహేశ్, సినీ రంగానికి చెందిన పలువురు కేటీఆర్‌కు శుభాకాంక్షలు తెలిపారు. యూఎస్ కాన్సులెట్ జనరల్ కేథరిన్ హడ్డాతో పాటు పలువురు శుభాకాంక్షలు తెలిపారు.
మొక్కలు నాటిన ప్రముఖులు..
కేటీఆర్ జన్మదినం సందర్భంగా ఎంపీ సంతోష్‌కుమార్ గిఫ్ట్ ఏ స్మైల్ ఛాలెంజ్ స్ఫూర్తిగా తీసుకుని కీసరగుట్ట సమీపంలోని అటవీ ప్రాంతాన్ని దత్తత తీసుకున్నారు. ఈ ఛాలెంజ్‌ను సినీ దర్శకుడు వంశీ పైడిపల్లి, మాజీ ఎంపీ కవిత, సినీనటులు విజయదేవరకొండ, నితిన్‌లకు విసిరారు. ఈరోజు కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా నితిన్ ఓ మొక్క నాటి... శుభాకాంక్షలు తెలిపారు. గిఫ్ట్ ఏ స్మైల్ మంచి కార్యక్రమం అని ఇందులో తనను భాగస్వామిని చేసినందుకు సంతోష్‌కుమార్‌కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. నితిన్ మొక్క నాటడాన్ని కేటీఆర్ అభినందించారు.