ఉప్పల్ కూడలిలో ట్రాఫిక్ సమస్యకు 100శాతం పరిష్కారం రాబోతుంది. భారీ వ్యయంతో జీహెచ్‌ఎంసీ(GHMC news) ట్రాఫిక్ రహితంగా తీర్చిదిద్దుతోంది. ఇప్పటికే ఈ కూడలి నుంచి 6.5కి.మీ పొడవున ఆరు లైన్ల వెడల్పుతో జాతీయ రహదారుల సంస్థ(NHAI) ఎలివేటెడ్ కారిడార్‌ను నిర్మిస్తోంది. అది కూడలికి 300మీటర్ల దూరంలో ఆగనుంది. జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో దాన్ని ఉప్పల్ కూడలిని దాటించి రామంతాపూర్ వైపు పొడిగించే పనులు గతంలో ఆమోదం పొందాయి. కొనసాగింపుగా.. ఉప్పల్ క్రికెట్ మైదానం రోడ్డుపై ఓ పైవంతెన, ఉప్పల్ కూడలి సికింద్రాబాద్-నాగోల్ మధ్య రాకపోకల కోసం రెండు పైవంతెనలను రూ.311కోట్ల అంచనా వ్యయంతో నిర్మించేందుకు తాజాగా రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన అనుమతులు మంజూరు చేసింది. అదే సమయంలో ఎన్‌హెచ్‌ఏఐ నిర్మిస్తోన్న భారీ పైవంతెన డిజైన్లకు జీహెచ్‌ఎంసీ సవరణలు సూచించింది.
నలుపు రంగు..
* ఉప్పల్ కూడలి నుంచి నారపల్లి వరకు ఎన్‌హెచ్‌ఏఐ నిర్మిస్తోన్న ఎలివేటెడ్ కారిడార్
కూడలికి ముందు ఆగిపోయే ఎన్‌హెచ్‌ఏఐ నిర్మాణాన్ని స్టేడియం రోడ్డు వైపు పొడిగించి జీహెచ్‌ఎంసీ నిర్మించబోయే పైవంతెన. హెచ్‌ఎండీఏ(HMDA NEWS) ఆధ్వర్యంలో కూడలిలో ప్రస్తుతం ఆకాశ మార్గం నిర్మాణమవుతోంది. వృత్తాకారంలో అన్ని వైపులా ఉన్న రోడ్లను కలుపుతూ పాదచారులు రహదారులను దాటుకునేందుకు ఈ నిర్మాణం ఉపయోగపడనుంది. దీని ఎత్తులోనే సికింద్రాబాద్-నాగోల్ మధ్య రాకపోకలను సులభతరం చేసేలా రెండు పైవంతెనలు ఇరువైపులా నిర్మాణం కానున్నాయి. వీటిని, మెట్రోరైలు మార్గాన్ని దాటుకుంటూ రోడ్డు ఉపరితలానికి 28మీటర్ల ఎత్తున ఉప్పల్-స్టేడియం రోడ్డు పైవంతెన పొడిగింపు పనులు జరగనున్నాయి.
ఆకుపచ్చరంగు..
వరంగల్ వైపు నుంచి నారపల్లి-ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ మీదుగా నగరంలోకి ప్రవేశించి క్రికెట్ స్టేడియం వద్ద రోడ్డుపై దిగిన వాహనదారుల కోసం స్టేడియం రోడ్డు మీదుగా ఓ పైవంతెనను నిర్మించనున్నారు. ఉప్పల్ రోడ్డు నుంచి మైదానం రోడ్డు వైపు వంపు తిరిగి ప్రయాణిస్తుంది.