కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో జీహెచ్ఎంసీ ముందు జాగ్రత్త చర్యలు చేపడుతోంది. విదేశాల నుంచి హైదరాబాద్ వచ్చిన వ్యక్తులను హోం క్వారంటైన్ చేస్తూ.. ముద్రలు వేయడం ప్రారంభించింది. ఎన్నికల పోలింగ్ కేంద్రంలో ఉపయోగించే ఇండెలిబుల్ ఇంకుతో రూపొందించిన స్టాంప్‌ను చేతి మడమపై కనిపించేలా వేస్తున్నారు.
కరోనా అలర్ట్: జీహెచ్ఎంసీ హోం క్వారంటైన్ ముద్రలు - GHMC Corona Home Quarantine
కరోనా విస్తరిస్తున్న తరుణంలో జీహెచ్ఎంసీ అప్రమత్తమైంది. విదేశాల నుంచి భాగ్యనగరానికి వచ్చిన వారికి హోం క్వారంటైన్ ముద్రలు వేస్తోంది. 14 రోజుల పాటు తప్పనిసరిగా 'హోం క్వారంటైన్'లో ఉండేలా చర్యలు తీసుకుంటోంది.
GHMC Home Quarantine
నగరానికి వచ్చినప్పటి నుంచి 14 రోజుల పాటు తప్పనిసరిగా హోం క్వారంటైన్లో ఉండాలని... అన్ని రోజులను లెక్కించి, స్టాంపులో తేదీని సరిచేసి ముద్ర వేస్తున్నారు. హైదరాబాద్ పరిధిలోనే 13 వేల మంది దాకా విదేశాల నుంచి వచ్చారని... వారందరి పాస్‌పోర్ట్ అడ్రస్‌లతో ఇళ్లకు వెళ్లి ముద్రలు వేస్తున్నారు. కరోనా లక్షణాలు ఉంటే పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలిస్తున్నారు.
ఇదీ చూడండి :'జనతా కర్ఫ్యూను జయప్రదం చేద్దాం'