హైదరాబాద్ నగర మేయర్ బొంతు రామ్మోహన్ అధ్యక్షతన ఈ రోజు స్టాండింగ్ కమిటీ సమావేశం జరిగింది. సమావేశంలో 24 ఎజెండా అంశాలను ఆమోదించారు. ప్రధానంగా జీహెచ్‌ఎంసీ 709 కిలోమీటర్ల రోడ్డు మార్గాన్ని ఐదేళ్ల పాటు రూ.1827కోట్ల వ్యయంతో నిర్వహణ చేపట్టడంతోపాటు స్వీపింగ్, గ్రీనరీ పనులు కూడా సంబంధిత ఏజెన్సీ చేపట్టేందుకు చేసిన సవరణ తీర్మానాన్ని ఆమోదించారు. నగరంలో మ్యాన్‌హోళ్లు, సెప్టిక్ ట్యాంక్‌ల నిర్వహణ, ప్రమాదవశాత్తు మృతి చెందివన 8మందికి పరిహారంగా 75లక్షల రూపాయలు చెల్లించే తీర్మానం ఆమోదం పొందింది. రాయదుర్గ గంగోత్రి పబ్లిక్ స్కూల్ నుంచి గెస్ట్‌హౌస్ వరకు 30మీటర్ల విస్తీర్ణంలో రోడ్డు విస్తరణ ప్రతిపాదనలకు ఆమోదం లభించింది. ఈ సమావేశంలో కమిషనర్ లోకేశ్ కుమార్‌తోపాటు ఇతర స్టాండింగ్ కమిటీ సభ్యులు హాజరయ్యారు.
24 అంశాలకు జీహెచ్‌ఎంసీ స్టాండింగ్ కమిటీ ఆమోదం - Ghmc Standing Committee Meeting today
జీహెచ్‌ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ అధ్యక్షతన ఇవాళ స్టాండింగ్ కమిటీ సమావేశం జరిగింది. సమావేశంలో 24 ఎజెండా అంశాలను ఆమోదించారు.

Ghmc Standing Committee Meeting
24 అంశాలకు జీహెచ్‌ఎంసీ స్టాండింగ్ కమిటీ ఆమోదం