జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో జరిగిన స్టాండింగ్ కమిటీ సమావేశంలో 8 తీర్మానాలను ఆమోదించారు. ప్రస్తుతం 221 జంక్షన్లలో ఉన్న ట్రాఫిక్ సిగ్నల్స్ ఆపరేషన్ అండ్ మెయింటనెన్స్‌ను 2020 మార్చి నుంచి మూడేళ్ల పాటు ఇచ్చేందుకు అనుమతించారు. కొత్తగా 155 కూడళ్లల్లో సిగ్నలింగ్ సిస్టం ఏర్పాటుతో పాటు కొత్తగా 98 పెలికాన్ సిగ్నల్ ఏర్పాటుకు ఆమోదించారు. ఈ పనులకు 59 కోట్ల 86 లక్షల రూపాయల ఖర్చవుతుంది.
8 తీర్మానాలను ఆమోదించిన జీహెచ్‌ఎంసీ - జీహెచ్‌ఎంసీ స్టాండింగ్ కమిటీ సమావేశం
జీహెచ్‌ఎంసీ స్టాండింగ్ కమిటీ సమావేశంలో మొత్తం 8 తీర్మానాలను ఆమోదించారు. స్వీపింగ్ యంత్రాల సేవలను 2021 ఆగస్టు 14 వరకు కొనసాగించుటకు తీర్మానించారు.
8 తీర్మానాలను ఆమోదించిన జీహెచ్‌ఎంసీ
నగర మేయర్ బొంతు రామ్మోహన్ అధ్యక్షతన జరిగిన స్టాండింగ్ కమిటీ సమావేశంలో కమిషనర్ లోకేష్‌కుమార్ కూడా పాల్గొన్నారు. మల్కాజిగిరి సర్కిల్ భరత్ నగర్ నుంచి ప్రగతి నగర్ వరకు ఆర్టీసీ కాలనీ నుంచి మౌలాలీ వార్డు నెంబర్ 138 వరకు 2 కోట్ల 10 లక్షలతో ఆర్‌సీసీ డ్రెయిన్ నిర్మించుటకు అమోదముద్ర వేశారు. స్వీపింగ్ యంత్రాల సేవలను 2021 ఆగస్టు 14 వరకు కొనసాగించుటకు తీర్మానించారు.