తెలంగాణ

telangana

ETV Bharat / state

కీలక ప్రతిపాదనలకు జీహెచ్​ఎంసీ స్టాండింగ్​ కమిటీ ఆమోదం - తెలంగాణ వార్తలు

పదోన్నతులు సహా పలు ప్రతిపాదనలకు జీహెచ్​ఎంసీ స్టాండింగ్​ కమిటీ ఆమోదం తెలిపింది. పదోన్నతుల ద్వారా సీనియర్​ అసిస్టెంట్​ పోస్టులను భర్తీ చేసేందుకు అంగీకరించింది.

ghmc standing committee meeting
ghmc standing committee meeting

By

Published : Dec 31, 2020, 8:42 PM IST

గచ్చిబౌలి జంక్షన్​ నుంచి ఓఆర్​ఆర్​ మార్గంలో బీఎస్​ఎన్​ఎల్​ కాంపౌండ్​ వాల్​ నిర్మాణానికి జీహెచ్​ఎంసీ స్టాండింగ్​ కమిటీ ఆమోదం తెలిపింది. మేయర్​ బొంతు రామ్మోహన్​ అధ్యక్షతన జరిగిన సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.

పదోన్నతుల ద్వారా సీనియర్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేసేందుకు అంగీకరించింది. ప్లేయర్​ కమ్ కోచ్​గా ఉన్న మహమ్మద్ రవూఫ్ అలీని.. స్పోర్ట్స్ ఇన్స్​స్పెక్టర్​గా పదోన్నతి కల్పించే ప్రతిపాదనకు ఆమోదముద్ర వేసింది. జూనియర్ డేటాబేస్​ అడ్మినిస్ట్రేటర్​గా ఉన్న కె.జయప్రకాష్​ను ఎన్నికల విభాగంలో అవుట్ సోర్సింగ్ పద్ధతిలో వినియోగించుకునేందుకు అంగీకరించింది. శానిటరీ జవాన్లకు హెల్త్​ అసిస్టెంట్లుగా పదోన్నతి కల్పించే ప్రతిపాదనకు అనుమతి ఇచ్చింది.

ఈ స‌మావేశానికి జీహెచ్​ఎంసీ క‌మిష‌న‌ర్ లోకేశ్​ కుమార్‌, స్టాండింగ్ క‌మిటీ స‌భ్యులు గంధం జోత్న్స, ముద్రబోయిన శ్రీనివాసరావు, మీర్​ బాసిత్​ అలీ, సామ స్వప్న‌, సున్నం రాజ్‌మోహ‌న్‌, మహ్మద్ నజీరుద్దీన్, ముఠా ప‌ద్మా న‌రేష్‌, కొల‌ను ల‌క్ష్మి, వి.సింధు, స‌బితా కిశోర్‌, బైరగోని ధనుంజయ భాయ్, ఎ.అరుణ, జీహెచ్ఎంసీ అధికారులు పాల్గొన్నారు.

ఇవీచూడండి:హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ హిమా కోహ్లి

ABOUT THE AUTHOR

...view details