తెలంగాణ

telangana

ETV Bharat / state

జీహెచ్​ఎంసీలో 17 కీలక తీర్మానాలకు ఆమోదం... - ట్రాఫిక్​ ఐలాండ్​

నగర మేయర్​ బొంతు రామ్మోహన్​ అధ్యక్షతన జరిగిన జీహెచ్​ఎంసీ స్టాండింగ్​ కమిటీ సమావేశంలో పలు కీలక తీర్మానాలకు ఆమోదం లభించింది. డిజాస్టర్​ రెస్పాన్స్​ ఫోర్స్​ యార్డ్​, వాటర్​ ట్రీట్​మెంట్​ ప్లాంట్​, ట్రాఫిక్​ ఐలాండ్​ ఏర్పాటుతో పాటు జీహెచ్​ఎంసీలో న్యాక్ ద్వారా నియ‌మితులైన ఔట్​సోర్సింగ్​ ఇంజినీర్లను మరో ఏడాది పాటు పొడగించే తీర్మానాలు ఆమోదం పొందాయి.

GHMC_Standing_Committe_Meeting

By

Published : Oct 17, 2019, 10:54 PM IST

జీహెచ్​ఎంసీలో 17 కీలక తీర్మానాలకు ఆమోదం...
హైదరాబాద్ మహానగర పాలక సంస్థ స్టాండింగ్ కమిటీ సమావేశంలో 17 తీర్మానాలకు ఆమోదం తెలిపారు. నగర మేయర్ బొంతు రామ్మోహన్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో జీహెచ్​ఎంసీ కమిషనర్ లోకేశ్​కుమార్‌తో పాటు కమిటీ సభ్యులు హాజరయ్యారు. హ‌య‌త్‌న‌గ‌ర్ స‌ర్కిల్ ఫ‌తుల్లాగూడ కృష్ణాన‌గ‌ర్ కాల‌నీ స‌ర్వే నెంబ‌ర్ 34లో ఉన్న 22,500 చ‌ద‌రపు మీట‌ర్ల ఖాళీ స్థలాన్ని డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ యార్డ్ ఏర్పాటుకు ఆంగీకరించారు. కొండాపూర్‌లోని కందికుంట చెరువులో 15కిలో కేఎల్డీ సామ‌ర్థ్యం గ‌ల వాట‌ర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్​ను సీఎస్సార్ కింద ఏర్పాటు చేయ‌డానికి ఐన్‌ఫ్లాక్స్ వాట‌ర్ సిస్టమ్ ప్రైవేట్ లిమిటెడ్​కు అనుమ‌తించే తీర్మానాన్ని ఆమోదించారు.

ట్రాఫిక్​ ఐలాండ్​ల నిర్మాణం....

శేరిలింగంప‌ల్లి స‌ర్కిల్​లోని బొటానికల్ గార్డెన్ నుంచి మ‌జీద్​బండ వ‌ర‌కు 2 కిలోమీట‌ర్ల మార్గంలో ఉన్న సెంట్రల్ మీడియం, ట్రాఫిక్ ఐలాండ్​ల‌ను సీఎస్సార్ కింద‌ నిర్వహించేందుకు మేస‌ర్స్ చిరాక్ ఇంట‌ర్నేష‌న‌ల్ స్కూల్‌కు కేటాయించారు. మైండ్‌స్పెస్ జంక్షన్ నుంచి గ‌చ్చిబౌలి రోలింగ్​హిల్స్ వ‌ర‌కు సెంట్రల్ మీడియం, ట్రాఫిక్ ఐలాండ్​ను సీఎస్సార్ కింద ఒక ఏడాది నిర్వహించేందుకు ఆమోదించారు. ఎస్సార్‌డీపీ ప‌థ‌కానికి రూపీ ట‌ర్మ్ లోన్ కింద రూ.2,500కోట్లను సేక‌రించ‌డానికి అరేంజ‌ర్‌గా ఎస్‌బీఐ క్యాప్స్‌ను 0.10 శాతం ఫీజుతో నియ‌మించేందుకు అంగీకరించారు.

జీహెచ్​ఎంసీలోనూ పలు తీర్మాణాలు...

జీహెచ్ఎంసీ ప‌రిధిలో ఉన్న బీఓటీ టాయిలెట్ల నిర్వహ‌ణ‌ను స‌ఫాయిక‌ర్మచారిల‌కు ప‌దేళ్లపాటు కేటాయించ‌డం.... టెండ‌ర్లలో పాల్గొనే మేత‌ర‌, వాల్మీకి వ‌ర్గానికి చెందిన‌వారికి సెక్యురిటీ డిపాజిట్‌ను రూ.50వేల నుంచి రూ.20వేల‌కు త‌గ్గించాలని నిర్ణయించారు. జీహెచ్ఎంసీలో న్యాక్ ద్వారా నియ‌మితులై ప‌నిచేస్తున్న 250 మంది ఔట్‌సోర్సింగ్‌ సైట్ ఇంజినీర్లు, ఇద్దరు సీనియ‌ర్ క‌న్సల్టెంట్ల సేవ‌ల‌ను మ‌రో ఏడాది పాటు పొడగించేందుకు పచ్చజెండా ఊపారు. ఇబ్రహీంబాగ్ తార‌మ‌తిబారాదారి ర‌హ‌దారి నుంచి పెద్ద చెరువు వ‌ర‌కు రూ.3.90 కోట్ల వ్యయంతో సీవ‌రేజ్ బాక్స్ డ్రెయిన్ నిర్మాణానికి స్టాండింగ్​ కమిటీ ఆమోదం తెలిపింది.

ఇదీ చూడండి: "జీతాల కోసం కాదు... ఆర్టీసీ పరిరక్షణ కోసం సమ్మె"

ABOUT THE AUTHOR

...view details