తెలంగాణ

telangana

ETV Bharat / state

జీహెచ్​ఎంసీ స్టాండింగ్​ కమిటీ నామినేషన్ల పరిశీలన పూర్తి - జీహెచ్​ఎంసీ స్టాండింగ్​ కమిటీ ఎన్నికలు నామినేషన్ల

జీహెచ్​ఎంసీ స్టాండింగ్​ కమిటీ ఎన్నికల నామినేషన్ల పరిశీలన ప్రక్రియ పూర్తయింది. 15 మంది నామినేషన్లు సక్రమంగా ఉన్నాయని జీహెచ్​ఎంసీ తెలిపింది. ఈ నెల 29న పోలింగ్​ జరగనుంది.

ghmc
ghmc

By

Published : Jun 20, 2020, 9:18 PM IST

జీహెచ్‌ఎంసీ స్టాండింగ్ క‌మిటీ ఎన్నిక‌ల‌ నామినేషన్ల పరిశీలన ప్రక్రియ పూర్త‌యింది. 15 మంది నామినేషన్లు సక్రమంగా ఉన్నాయని జీహెచ్ఎంసీ ప్రకటించింది. అనంత‌రం అధికారులు తుది జాబితా ప్ర‌క‌టించారు. ఈ నెల 23వ తేదీ సాయంత్రం 3 గంట‌ల వ‌ర‌కు నామినేష‌న్ల ఉప‌సంహ‌రణకు అవ‌కాశం ఉందని తెలిపారు.

ఈ నెల 29వ తేదీ ఉద‌యం 10 గంట‌ల నుంచి సాయంత్రం 3 గంట‌ల వ‌ర‌కు జీహెచ్‌ఎంసీ ప్ర‌ధాన కార్యాల‌యంలో పోలింగ్ నిర్వ‌హించ‌న‌నున్నారు. 15 మంది అభ్యర్థులు పోటీలో ఉండడం వల్ల ఎన్నిక ఏకగ్రీవమయ్యే అవకాశం ఉంది.

ఇవీ చూడండి: ఎమ్మెల్యే రాజాసింగ్​ గన్​మెన్​కు కరోనా పాజిటివ్

ABOUT THE AUTHOR

...view details