తెలంగాణ

telangana

ETV Bharat / state

GHMC: సీజనల్ వ్యాధుల నివారణకు ప్రతి ఆదివారం 10 నిమిషాలు - telangana latest news

హైదరాబాద్​లో సీజనల్​ వ్యాధుల నివారణ కోసం జీహెచ్​ఎంసీ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు 10 నిమిషాల పాటు దోమల నివారణ కార్యక్రమాలను చేపట్టాలని నిర్ణయించింది. 10 వారాల పాటు ఈ కార్యక్రమాలు సాగనున్నాయి.

GHMC: సీజనల్ వ్యాధుల నివారణకు ప్రతి ఆదివారం 10 నిమిషాలు
GHMC: సీజనల్ వ్యాధుల నివారణకు ప్రతి ఆదివారం 10 నిమిషాలు

By

Published : Aug 21, 2021, 8:29 PM IST

హైదరాబాద్ నగరంలో మలేరియా, డెంగీ తదితర వ్యాధుల నివారణకై జీహెచ్​ఎంసీ ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రేపటి నుంచి ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు 10 నిమిషాల పాటు దోమల నివారణ కార్యక్రమాలను చేపట్టబోతోంది. ఈ మేరకు నగరంలోని ప్రజాప్రతినిధులు, కార్పొరేటర్లు, కాలనీ సంక్షేమ సంఘాలు, స్వచ్ఛంద సంస్థలను కార్యక్రమంలో భాగస్వాములను చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.

దోమల వ్యాప్తిని అరికట్టేందుకు 10 వారాల పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని బల్దియా స్పష్టం చేసింది. సీజనల్ వ్యాధుల నివారణకు యాంటీ లార్వా క్యాంపెయిన్​ నిర్వహించాలని సూచించింది. దోమల గుడ్లను నశింపజేసేందుకు ఇళ్లు, కార్యాలయాల్లో నీటి నిల్వలను ఖాళీ చేయించి.. పరిశుభ్రంగా ఉంచాలని తెలిపింది.

Vaccination: సోమవారం నుంచి జీహెచ్ఎంసీలో కొవిడ్ వ్యాక్సినేషన్ స్పెషల్​ డ్రైవ్

ABOUT THE AUTHOR

...view details