తెలంగాణ

telangana

ETV Bharat / state

పార్కుల‌పై జీహెచ్ఎంసీ ప్రత్యేక దృష్టి

హైద‌రాబాద్ న‌గ‌రంలో పార్కుల‌పై జీహెచ్ఎంసీ ప్రత్యేక దృష్టి సారించింది. దోమ‌లగూడ‌లోని ఇందిరా పార్కులో ఎక‌రం విస్తీర్ణంలో పంచ‌త‌త్వ ఆక్యూప్రెజ‌ర్ వాకింగ్ ట్రాక్ పార్క్ నిర్మాణం జరుగుతోంది. పాదచారుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని నూతన విధానంలో ట్రాక్ నిర్మాణం జరుగుతోంది.

ghmc special focus on parks in Hyderabad
పార్కుల‌పై జీహెచ్ఎంసీ ప్రత్యేక దృష్టి

By

Published : Feb 20, 2020, 1:03 PM IST

హైద‌రాబాద్ న‌గ‌రంలో పార్కుల‌పై జీహెచ్ఎంసీ ప్రత్యేక దృష్టి సారించింది. జోన్​ల వారిగా వివిధ ర‌కాల పార్కుల‌ను అభివృద్ది చేస్తోంది. అందులో భాగంగానే దోమ‌లగూడ‌లోని ఇందిరా పార్కులో ఎక‌రం విస్తీర్ణంలో పంచ‌త‌త్వ ఆక్యూప్రెజ‌ర్ (శ‌రీరంపై ఒత్తిడి క‌లిగించు) వాకింగ్ ట్రాక్ పార్క్ నిర్మాణం జరుగుతోంది. దాదాపు 80శాతం ప‌నులు పూర్తి కావచ్చాయి. ఆక్యూప్రెజ‌ర్ ప‌ద్ధతిలో ఎనిమిది అంశాల‌ు ప్రమాణికంగా ఈ పార్కును నిర్మిస్తున్నారు.

పాదచారుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని..

స‌ర్కిల్ ప‌ద్ధతిలో ట్రాక్​పై న‌డుస్తున్నప్పుడు పాదాల అడుగు భాగంలో ఉన్న న‌రాల‌పై వివిధ స్థాయిలో ఒత్తిడిని క‌లిగించే ప‌ద్ధతిలో 20 ఎంఎం, 10 ఎంఎం రాళ్లు, రివ‌ర్ స్టోన్స్‌, 6 ఎంఎం చిప్స్‌, ఇసుక‌, చెట్ల బెర‌డు, న‌ల్లరేగ‌డి మ‌ట్టి, నీటి బ్లాక్‌ల‌ను విడివిడిగా అనుసంధానం చేస్తూ వాకింగ్​ ట్రాక్‌ను నిర్మించారు. ఈ స‌ర్కిల్‌కు అన్ని వైపులా 40 ర‌కాల మెడిసిన‌ల్, హెర్బల్‌ ప్లాంట్స్‌ను బ్లాక్‌లుగా ఏర్పాటు చేశారు. మొద‌ట‌గా న‌రాల‌పై అధిక ఒత్తిడి క‌లిగించే ట్రాక్ నుంచి క్రమ ప‌ద్ధతిలో ఒత్తిడి త‌గ్గించే ట్రాక్ వైపు న‌డ‌వ‌టం వ‌ల్ల ర‌క్తప్రస‌ర‌ణ‌లో సానుకూల మార్పు జ‌రిగి అనారోగ్యాలు దూర‌మ‌వుతాయి. ఈ పార్కు మ‌ధ్యలో గౌత‌మ బుద్దుడి విగ్రహాన్ని నెల‌కొల్పారు.

ఇవీ చూడండి:మహిళల భద్రతే ప్రథమ లక్ష్యం: సజ్జనార్

ABOUT THE AUTHOR

...view details