హైదరాబాద్ నగరంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో.. స్థానిక కార్పొరేటర్లు అప్రమత్తమయ్యారు. గన్ ఫౌండ్రి డివిజన్ కార్పొరేటర్ డా.సురేఖ.. బల్దియా అధికారులతో కలిసి కాలనీల్లో శానిటైజ్ చేయించారు. డివిజన్లో పది రోజులుగా కరోనా కేసులు అధికంగా నమోదవుతుండటం ఆందోళనకు గురి చేస్తోందన్నారు. రెండు రోజుల వ్యవధిలో నలుగురు మృతి చెందారంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
అప్రమత్తమైన కార్పొరేటర్లు.. డివిజన్లలో శానిటైజేషన్ - sanitization at gunfoundry
జీహెచ్ఎంసీలో కొవిడ్ సెకండ్ వేవ్ నేపథ్యంలో స్థానిక కార్పొరేటర్లు అప్రమత్తమయ్యారు. కాలనీలలో బ్లీచింగ్ పౌడర్ వంటివి చల్లుతూ కొవిడ్ కట్టడికి చర్యలు తీసుకుంటున్నారు.
sanitization at gunfoundry
జీహెచ్ఎంసీ అధికారులు.. వైరస్ కట్టడికి ఎన్నో చర్యలు చేపడుతున్నారని సురేఖ వివరించారు. ప్రజలంతా అందుకు సహకరించాలని కోరారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ.. అవసరమైతే తప్ప బయటకు రావొద్దని ఆమె విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండి:కరోనా వేళ ... ఆటోవాలా ఔదార్యం