తెలంగాణ

telangana

ETV Bharat / state

'కరోనాతో మరణించిన కార్మికుల కుటుంబాలకు రూ.కోటి పరిహారం ఇవ్వాలి' - జీహెచ్‌ఎంసీ కార్మికుల ధర్నా

కరోనాతో మరణించిన జీహెచ్‌ఎంసీ పట్టించుకోవడం లేదని పారిశుద్ధ్య, ఎంటమాలాజి కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. వైరస్ వ్యాప్తిలోనూ ప్రాణాలను పణంగా పెట్టి పనిచేస్తున్నామన్నారు. మహమ్మారితో మృతి చెందిన వారి కుటుంబాలకు కోటి రూపాయల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం ధర్నా నిర్వహించారు.

ghmc sanitation workers
ghmc sanitation workers

By

Published : Aug 12, 2020, 4:38 PM IST

జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం ఎదుట పారిశుద్ధ్య, ఎంటమాలాజి కార్మికులు ధర్నా నిర్వహించారు. కరోనా ఉద్ధృతంగా ఉన్న సమయంలోనూ అహర్నిశలు కృషి చేశామని... ఎంతో మంది కార్మికులు కరోనా బారిన పడ్డారనీ ఆవేదన వ్యక్తం చేశారు. కరోనాతో మరణించినా బల్దియా పట్టించుకోవడం లేదన్నారు.

చనిపోయిన బల్దియా కార్మికుల కుటుంబాలకు కోటి రూపాయల పరిహారం ఇవ్వాలని నాయకులు డిమాండ్ చేశారు. గాంధీ ఆసుపత్రిలో కార్మికులకు ఇచ్చినట్లుగానే... పారిశుద్ధ్య కార్మికులకు రూ.25 వేల వేతనం చెల్లించాలి డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి:ఆహారశుద్ధి పరిశ్రమలను ప్రోత్సహిస్తే రైతులకు మేలు : కేటీఆర్​

ABOUT THE AUTHOR

...view details