తెలంగాణ

telangana

ETV Bharat / state

డ్రైనేజీలో మెడ లోతున దిగి... వ్యర్థాలను తొలగించి... - మ్యాన్​హోల్​లో దిగిన పారిశుద్ధ్య కార్మికుడు

ఇప్పుడు వ్యక్తిగత పరిశుభ్రత ఎంత ముఖ్యమో అందరికీ తెలుసు. బయటకు వెళ్లి వస్తే శానిటైజర్‌తో చేతులు శుభ్రం చేసుకోనిదే ఇంట్లోకి వెళ్లడం లేదు. బయట ఎక్కడైన చెత్త కనిపిస్తే దానికి దూరంగా ఉంటున్నాం. కానీ వ్యర్థాలను శుభ్రం చేసేందుకు పారిశుద్ధ్య కార్మికులు డ్రైనేజీలో మెడ లోతు వరకు దిగి పని చేస్తున్నారు. ప్రమాదకర పరిస్థితుల్లో విధులు నిర్వహిస్తున్నారు.

sapayi
sapayi

By

Published : Jul 22, 2020, 10:39 AM IST

ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో మనం దేన్ని ముట్టుకున్నా ఒకటికి రెండుసార్లు చేతులు కడుక్కుంటున్నాం. శానిటైజర్‌తో శుభ్రం చేసుకుంటున్నాం. కానీ పారిశుద్ధ్య కార్మికులు డ్రైనేజీలో మెడ లోతున దిగి వ్యర్థాలను తొలగిస్తున్నారు. రక్షణ వస్త్రాలు లేకుండానే ప్రమాదకర పరిస్థితిలో విధులు నిర్వహిస్తున్నారు.

హైదరాబాద్‌ బేగంబజార్‌లోని ప్రధాన డ్రైనేజి(ఇటీవల ఉస్మానియా ఆసుపత్రిని ముంచెత్తిన మురుగునీరు దీని నుంచే వెళుతుంది)లో ఓ కార్మికుడు మంగళవారం మ్యాన్‌హోల్‌లోకి దిగి వ్యర్థాలను తొలగిస్తుండగా ‘ఈనాడు’ తీసిన చిత్రమిది.

ABOUT THE AUTHOR

...view details