తెలంగాణ

telangana

ETV Bharat / state

పారిశుద్ధ్య కార్మికుల వేతనాల పెంపు ఉత్తర్వులు జారీ - పారిశుద్ధ్య కార్మికుల వేతనాలు పెంపు

దీపావళి సందర్భంగా పారిశుద్ధ్య కార్మికుల వేతనాలు పెంచుతున్నట్లు మంత్రి కేటీఆర్ ప్రకటించగా... ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. జీహెచ్ఎంసీ శానిటరీ పబ్లిక్ హెల్త్ వర్కర్స్, ఫీల్డ్ అసిస్టెంట్లకు, శానిటరీ ఫీల్డ్ అసిస్టెంట్లు, ఎంటమాలజీ ఫీల్డ్ అసిస్టెంట్లకు రూ.3వేలు పెంచినట్లు పేర్కొంది. వేతనాల పెంపు నవంబర్ నుంచి అమల్లోకి రానుందని వెల్లడించింది.

ghmc sanitation staff salaries hike
పారిశుద్ధ్య కార్మికుల వేతనాల పెంపు ఉత్తర్వులు జారీ

By

Published : Nov 15, 2020, 5:34 PM IST

పారిశుద్ధ్య కార్మికుల వేతనాలు పెంచుతూ ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులు జారీచేసింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పారిశుద్ధ్య కార్మికులకు దీపావళి సందర్భంగా వేతనాలు పెంచుతున్నట్లు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ శనివారం ప్రకటించారు. జీహెచ్ఎంసీ శానిటరీ పబ్లిక్ హెల్త్ వర్కర్స్, ఫీల్డ్ అసిస్టెంట్లకు రూ.14 వేల నుంచి రూ.17 వేలకు పెంచారు. శానిటరీ ఫీల్డ్ అసిస్టెంట్లు, ఎంటమాలజీ ఫీల్డ్ అసిస్టెంట్లకు రూ.14,500 నుంచి 17,500లకు పెంచుతూ ఉత్తర్వులు జారీచేసింది.

ఈ వేతనాలు పెంపు నవంబర్ నుంచి అమల్లోకి రానుందని.. డిసెంబర్‌లో పెరిగిన వేతనాలు అందించనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

ఇదీ చదవండి:'ఆరేళ్లలో పారిశుద్ధ్య కార్మికుల వేతనాలు రెండింతలు పెంచాం'

ABOUT THE AUTHOR

...view details