కరోనా వైరస్‌పై పోరులో ముందువరుసలో ఉండి ఎదురొడ్డి పోరాడుతున్నది పారిశుద్ధ్య కార్మికులేనని మేయర్ బొంతు రామ్మోహన్ కొనియాడారు. హైదరాబాద్‌లోని చార్మినార్ వద్ద ఏర్పాటు చేసిన సంఘీభావ సమావేశంలో ఆయన పాల్గొన్నారు.
"నగరాన్ని శుద్ధి చేయడంలో పారిశుద్ధ్య కార్మికులు ప్రముఖ పాత్ర పోషిస్తున్నారు. ప్రజలను ఇంట్లో ఉండమని మనం రోడ్లపైకి వచ్చి ప్రాణాలు లెక్కచేయకుండా పోరాడుతున్నాం. మన సేవలను గుర్తించిన ప్రభుత్వం మనకు ప్రోత్సాహకాలు సైతం అందించింది. ఇలాగే విధులు కొనసాగించి కరోనాను తరిమేద్దాం. దీంతో పాటు మన ఆరోగ్యం కూడా మనకు ముఖ్యమే. కొంతమంది మాస్కులు సరిగా ధరించడం లేదు. గ్లౌజులు కూడా వాడటం లేదు. నగరాన్ని శుద్ధి చేసే క్రమంలో మనం కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. "