పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఫిర్యాదుపై జీహెచ్ఎంసీ అధికారులు(GHMC response on Revanth tweet) స్పందించారు. వరంగల్ జాతీయ రహదారి పక్కన ఉప్పల్ కలాన్‌లోని జెమ్ అవెన్యూ అక్రమ నిర్మాణాలపై(GHMC response on Revanth tweet) రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. నిర్మాణాలపై మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్‌ను రేవంత్ ప్రశ్నించారు. ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసిన అధికారులు పట్టించుకోవడం లేదని ట్విట్టర్లో పేర్కొన్నారు.
GHMC response on Revanth tweet: రేవంత్ ట్వీట్.. కేటీఆర్‌కు ట్యాగ్.. జీహెచ్ఎంసీ షాక్
హైదరాబాద్‌లో అక్రమ నిర్మాణాలపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి(GHMC response on Revanth tweet) ట్వీట్‌పై జీహెచ్ఎంసీ స్పందించింది. ఉప్పల్‌లోని అక్రమ నిర్మాణాలను అధికారులు కూలగొట్టారు. ట్వీట్‌ను మంత్రి కేటీఆర్, తెలంగాణ సీఎంవో, జీహెచ్ఎంసీ కమిషనర్‌కు రేవంత్ ట్యాగ్ చేశారు.
'మీ శాఖ బాగోతాల మీద చర్యలు ఉంటాయా.. లేక మీరూ అందులో భాగస్వాములేనా' అంటూ కేటీఆర్‌ను(GHMC response on Revanth tweet) ట్విట్టర్ ద్వారా రేవంత్ ప్రశ్నించారు. ఆధారాలను అటాచ్ చేస్తూ సీఎంఓ, జీహెచ్ఎంసీ కమిషనర్‌కు ట్యాగ్ చేశారు. ట్వీట్‌పై స్పందించిన జీహెచ్ఎంసీ అధికారులు(GHMC response on Revanth tweet) .. సిబ్బందితో నిర్మాణం జరుగుతున్న ప్రదేశానికి వెళ్లారు. పనులను పరిశీలించారు. అనుమతులపై ఆరాతీయగా.. అలాంటేమిలేవని గుర్తించి.. వెంటనే పనులను ఆపుచేయించి బిల్డర్‌కు నోటీసులు జారీచేశారు.
ఇదీ చదవండి:Police assault on woman: ఉద్యోగం అడిగితే.. తెరాస వాళ్లు కొట్టించారు.. చేతులు, కాళ్లు లాగేసి...