తెలంగాణ

telangana

ETV Bharat / state

చిక్కడపల్లిలోని అక్రమ దుకాణాల తొలగింపు - హైదరాబాద్​ చిక్కడపల్లి

రోడ్డుపై అక్రమంగా ఏర్పాటు చేసిన అక్రమ దుకాణాలను తొలగించాలన్న హైకోర్టు ఆదేశాలతో జీహెచ్​ఎంసీ అధికారులు చర్యలు చేపట్టారు.

చిక్కడపల్లిలోని అక్రమ పాన్​ డబ్బా తొలగింపు
చిక్కడపల్లిలోని అక్రమ పాన్​ డబ్బా తొలగింపు

By

Published : Dec 21, 2019, 5:44 PM IST

చిక్కడపల్లిలోని అక్రమ పాన్​ డబ్బా తొలగింపు
హైదరాబాద్​ చిక్కడపల్లిలోని పెండేకంటి లా కళాశాల పరిసరాల్లో అక్రమంగా పాన్​ డబ్బాను గ్రేటర్ అధికారులు తొలగించారు. ఈ దుకాణంపై స్థానికులు పలుమార్లు జీహెచ్​ఎంసీ, ట్రాఫిక్​ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయినా వారు స్పందించకపోనందున హైకోర్టును ఆశ్రయించారు.

ఉన్నత న్యాయస్థానం ఉత్తర్వులు అందుకున్న జీహెచ్​ఎంసీ అధికారులు.. పోలీసుల సాయంతో ఆ డబ్బాను తొలగించారు. ఆ షాపునకు విద్యుత్​ సరఫరా ఎవరిచ్చారని అధికారులు ప్రశ్నించారు. ఈ తొలగింపుపై స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.

ABOUT THE AUTHOR

...view details