గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో భాగంగా అధికారులు ఫ్లెక్సీలను తొలగిస్తున్నారు. ఇప్పటివరకు నగరంలో 10, 777 పోస్టర్లు, బ్యానర్లు, ఫ్లెక్సీలను తొలగించామని జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలు అధికారి విశ్వజిత్ కంపాటి తెలిపారు.
'జీహెచ్ఎంసీ ఎన్నికల నియమావళి ఉల్లంఘనలపై చర్యలు'
జీహెచ్ఎంసీ ఎన్నికల నియమావళి అమలులో భాగంగా పోస్టర్లు, బ్యానర్లు, ఫ్లెక్సీలను తొలగించినట్లు ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలు అధికారి విశ్వజిత్ తెలిపారు. ఈ తొలగింపు ప్రక్రియ పోలింగ్ అయ్యేంతవరకు కొనసాగుతుందన్నారు.
'జీహెచ్ఎంసీ ఎన్నికల నియమావళి ఉల్లంఘనలపై చర్యలు'
గ్రేటర్‌లో అనధికార ఫ్లెక్సీలు, బ్యానర్ల తొలగింపునకు 20 ప్రత్యేక బృందాలు మూడు షిఫ్టులుగా పని చేస్తున్నాయని వెల్లడించారు. ఈ నెల 17న 280, ఈనెల 18న 4,120, 19వ తేదీన 3,860 అనుమతిలేని ఫ్లెక్సీలు, బ్యానర్లు తొలగించామని విశ్వజిత్ వివరించారు. ఈ తొలగింపు ప్రక్రియ పోలింగ్ అయ్యేంతవరకు కొనసాగుతుందన్నారు.
ఇదీ చూడండి:జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రవర్తన నియమావళి నిబంధనలు ఇవే..