తెలంగాణ

telangana

ETV Bharat / state

హైదరాబాద్‌ వాసులకు అలర్ట్.. నేడే చివరి ఛాన్స్‌.. త్వరపడండి

GHMC property tax Last date today హైదరాబాద్ వాసులకు అలర్ట్.. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లో ఆస్తిపన్ను చెల్లింపునకు ఇవాళే చివరి రోజు. ఇక ఆ రోజు రాత్రి 11 గంటల వరకు అన్ని జీహెచ్ఎంసీ సర్కిల్, ప్రధాన కార్యాలయంలోని సిటిజన్ షిప్ కార్యాలయాలు తెరిచి ఉంటాయని జీహెచ్ఎంసీ వెల్లడించింది.

ghmc
ghmc

By

Published : Mar 30, 2023, 8:37 PM IST

Updated : Mar 31, 2023, 6:51 AM IST

GHMC property tax Last date today: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లో ఆస్తిపన్ను చెల్లింపునకు ఇవాళే చివరి రోజు. ఆర్థిక ఏడాది మొదటిలో రికార్డు స్థాయిలో వసూళ్లు అయినా.... ఏడాది చివరికి మాత్రం అనుకున్నంత స్థాయిలో ఆస్తిపన్ను వసూళ్లు కాలేదు. ఆర్థిక ఏడాదిలో గురువారం వరకు మొత్తం 1600 కోట్ల రూపాయలు ఆస్తి పన్ను వసూళ్లయింది. 2022-23 ఆర్థిక ఏడాదిలో 2వేల కోట్ల టార్గెట్ పెట్టుకోగా కేవలం 80 శాతం మాత్రమే పూర్తయింది. ఈరోజు ఆస్తి పన్ను చెల్లించేందుకు చివరి రోజు కావడంతో రాత్రి 11 గంటల వరకు అన్ని జీహెచ్ఎంసీ సర్కిల్, ప్రధాన కార్యాలయంలోని సిటిజన్ షిప్ కార్యాలయాలు తెరిచి ఉంటాయని జీహెచ్ఎంసీ వెల్లడించింది.

జీహెచ్‌ఎంసీకి ఈ ఆర్థిక ఏడాదిలో మొదట రికార్డు స్థాయిలో ఆస్తిపన్ను వసూళ్లు అయినా.. తరువాత నెమ్మదించాయి. తొలి త్రైమాసికంలో ఆస్తి పన్ను మునుపెన్నడు లేని రీతిలో అత్యధికంగా వసూల్ అయ్యాయి. ఈ ఆర్థిక సంవత్సరం ఆస్తి పన్ను వసూళ్ల లక్ష్యం రెండు వేల కోట్ల రూపాయలు ఉండగా.. గురువారం వరకు 1600 కోట్ల రూపాయలు మాత్రమే వసూళ్లు అయ్యాయి. జీహెచ్‌ఎంసీకి ప్రధాన ఆదాయ వనరుల్లో సింహభాగం ఆస్తి పన్నే. వీటి ద్వారానే సిబ్బంది, పెన్షన్‌దారుల జీత భత్యాల చెల్లింపులు చేస్తుంది.

మొదట్లో ఎర్లీబర్డ్‌ ఆఫర్‌లో భాగంగా 2022-23 ఆర్థిక సంవత్సరానికి 741.35 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. ప్రతి ఏడాది కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో జీహెచ్ఎంసీ ఆస్తి పన్ను రాబట్టుకునేందుకు 5 శాతం రాయితీ ప్రకటించి ముందస్తు ఆదాయం రాబట్టుకుంటుంది. ఆస్తిపన్ను చెల్లింపులో రాయితీ అవకాశాన్ని వినియోగించుకొని దాదాపు 40 శాతం మంది.. సుమారు 8 లక్షలపై చిలుకు మంది తమ ఆస్తిపన్ను చెల్లించారు. అధికంగా ఆన్లైన్‌లో పన్ను చెల్లించారు. గత రెండేళ్లతో మొదటి నాలుగు నెలల్లోనే ఇంత పెద్ద ఎత్తున ప్రాపర్టీ ట్యాక్స్ వసూళ్లు కావడం ఈ ఏడాదే అని జీహెచ్ఎంసీ వర్గాలు చెబుతున్నాయి.

ఆస్తి పన్ను ఆన్‌లైన్‌లో కట్టడం... ఇంటింటికి వెళ్లి పన్ను వసూళ్లు చేయడం.... ఎర్లీ బర్డ్ ఆఫర్ పెట్డడంతో అధికంగా వసూళ్లు అవుతున్నాయి. ఇక శుక్రవారం ఒక్కరోజే ఈ ఆర్థిక ఏడాది పన్ను చెల్లింపునకు ఆఖరి రోజు ఉండడంతో రాత్రి 11 గంటల వరకు జంట నగరాల్లోన జీహెచ్ఎంసీ సిటిజన్ కార్యాలయాలు పనిచేయనున్నట్లు జీహెచ్ఎంసీ వెల్లడించింది. జీహెచ్ఎంసీ సర్కిల్, ప్రధాన కార్యాలయంలోని సిటిజన్ కార్యాలయాలలో రాత్రి 11 గంటల వరకు సేవలు అందించాలని ఆదేశాలు జారీ చేసింది. ఆస్తి పన్ను చెల్లించేందుకు వచ్చే వారికోసం ఏర్పాట్లు చేయాలని డిప్యూటీ కమిషనర్లను జీహెచ్ఎంసీ ఆదేశించింది. ఇప్పటి వరకు ఆస్తి పన్ను చెల్లించని వారు శుక్రవారం చెల్లిచాలని జీహెచ్ఎంసీ కోరింది.

ఇవీ చదవండి:

Last Updated : Mar 31, 2023, 6:51 AM IST

ABOUT THE AUTHOR

...view details