తెలంగాణ

telangana

ETV Bharat / state

కరోనా కట్టడికి 'గ్రేటర్' చర్యలు - GHMC PREVENTIVE ACTIVITIES TO STOP CORONA VIRUS EXTENSION

కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు సికింద్రాబాద్​లోని పలు ప్రాంతాల్లో ద్రావణం పిచికారీ చేశారు. వివిధ అత్యవసర విభాగాల వారు తమ విధి నిర్వహణను సమర్థంగా నిర్వర్తిస్తున్నారు. ప్రజలు కూడా తమకు సహకరించి ఇళ్లల్లోంచి ఎవరూ బయటకు రాకూడదని అధికార యంత్రాంగం కోరుతోంది.

జీహెఎంసీ కట్టుదిట్టమైన చర్యలు
జీహెఎంసీ కట్టుదిట్టమైన చర్యలు

By

Published : Mar 30, 2020, 10:56 AM IST

కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు జీహెచ్ఎంసీ అధికారులు అహర్నిశలు కృషి చేస్తున్నారు. సికింద్రాబాద్​లోని చిలకలగూడ, మోండా మార్కెట్, ప్యాట్నీ ప్రాంతాల్లో రసాయనాలను పిచికారీ చేశారు. రోడ్లు, బస్ స్టాప్​లు, జన సమ్మర్థ ప్రాంతాల్లో పిచికారీ చేపట్టారు. ఒక వైపు వైద్యులు, నర్సులు, సిబ్బంది తమ కుటుంబ సభ్యులకు దూరంగా రోగులకు సేవలందిస్తున్నారు. జనాలు రోడ్ల మీదికి రాకుండా తమ ప్రాణాలను ఫణంగా పెట్టి రోడ్లపైనే విధులు నిర్వహిస్తున్నారు పోలీసులు.

పారిశుద్ధ్య కార్మికులూ...

అదేస్థాయిలో పారిశుద్ధ్య కార్మికులు రోడ్లు, బస్తీలను శుభ్రం చేస్తూ తమవంతు సేవలందిస్తున్నారు. ఇందులో భాగంగానే ఆదివారం సికింద్రాబాద్ చిలకలగూడ చౌరస్తా పరిసర ప్రాంతాల్లో జీహెచ్ఎంసీ ఎన్​ఫోర్స్​మెంట్, విజిలెన్స్ అధికారులు రసాయనాలు పిచికారీ చేయించారు. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాకుండా ఉండటమే అందరికీ శ్రేయస్కారమని యంత్రాంగం సూచించింది.

జీహెఎంసీ కట్టుదిట్టమైన చర్యలు

ఇవీ చూడండి : కరోనా వైరస్​ ఎలా ప్రవేశిస్తుందో తెలుసా..?

ABOUT THE AUTHOR

...view details