గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల సన్నాహకాలు కొనసాగుతున్నాయి. ఎన్నికల విషయమై ఇప్పటికే జీహెచ్ఎంసీ అధికారులతో సమీక్షించిన రాష్ట్ర ఎన్నికల సంఘం... అదనపు ఎన్నికల అథారిటీని నియమించింది. ఎన్నికల అథారిటీగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కమిషనర్ ఉంటారు. ఎన్నికల నిర్వహణ ప్రక్రియలో అథారిటీకి సహకరించేందుకు వీలుగా అదనపు ఎన్నికల అథారిటీలను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి నియమించారు. జీహెచ్ఎంసీ పరిధిలోని జిల్లాల కలెక్టర్లకు ఈ బాధ్యతలు అప్పగించారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజ్‌గిరి, సంగారెడ్డి కలెక్టర్లను అదనపు ఎన్నికల అథారిటీలుగా నియమించారు. ఈ మేరకు నోటిఫికేషన్ జారీ అయింది.
కొనసాగుతున్న గ్రేటర్ ఎన్నికల సన్నాహకాలు - గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు
గ్రేటర్ ఎన్నికలకు సంబంధించి జీహెచ్ఎంసీ అధికారులతో రాష్ట్ర ఎన్నికల సంఘం సమీక్ష జరిపింది. ఎన్నికల నిర్వహణ ప్రక్రియలో ఎన్నికల అథారిటీకి సహకరించేందుకు అదనపు ఎన్నికల అథారిటీలను అథారిటీలను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి నియమించారు.
కొనసాగుతున్న గ్రేటర్ ఎన్నికల సన్నాహకాలు