తెలంగాణ

telangana

ETV Bharat / state

మురికి వాడల్లో కొత్తగా 200 బస్తీ దవాఖానాలు - ETV BHARAT

గ్రేట‌ర్ హైద‌రాబాద్‌లో నిరుపేద‌ల‌కు ప్రాథమిక వైద్య చికిత్సలు, ప‌రీక్షలు అందించే బ‌స్తీ దవాఖానాల ప‌నితీరును జీహెచ్ఎంసీ క‌మిష‌న‌ర్ దాన‌కిషోర్ ఆక‌స్మికంగా త‌నిఖీ చేశారు. మురికివాడల్లో మరో 200 బస్తీ ఆసుపత్రులు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

మురికి వాడల్లో కొత్తగా 200 బస్తీ దవాఖానాలు

By

Published : Aug 1, 2019, 11:33 AM IST

గ్రేటర్​ పరిధిలో ఇప్పటికే 112 అర్బన్ హెల్త్ కేంద్రాలు ప‌నిచేస్తుండ‌గా... 98 యూహెచ్‌సీలు ప్రభుత్వ భ‌వ‌నాల్లో ప‌నిచేస్తున్నాయని జీహెచ్​ఎంసీ కమిషనర్​ దానకిషోర్​ తెలిపారు. వీటికి అదనంగా మురికి వాడ‌ల్లో మ‌రో 200 బ‌స్తీ దవాఖానాలు ఏర్పాటు చేయాల‌ని నిర్ణయించారు. మురికి వాడల్లో నివసించే వారందరికీ నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం కృషిచేస్తోందని తెలిపారు. గ్రేట‌ర్ హైద‌రాబాద్‌లోని బ‌స్తీ దవాఖానాల ప‌నితీరును పరిశీలించిన ఆయన... బ‌స్తీ ఆసుపత్రుల్లో రోజుకు 80 మంది రోగులు ఓపీ సేవల కోసం వ‌స్తున్నార‌న్నారు. ఈ సంఖ్యను 200 వ‌ర‌కు పెంచేలా చ‌ర్యలు చేప‌ట్టాల‌ని అధికారుల‌కు సూచించారు. బీపీ నిర్ధరణ చేసే పరికరాలను అన్ని బ‌స్తీ ఆసుపత్రులకు అందించాల‌ని హైద‌రాబాద్ జిల్లా ఆరోగ్యశాఖ అధికారులను ఆదేశించారు.

మురికి వాడల్లో కొత్తగా 200 బస్తీ దవాఖానాలు

ABOUT THE AUTHOR

...view details