సికింద్రాబాద్ యాప్రాల్‌లోని అక్రమ నిర్మాణాలపై జీహెచ్‌ఎంసీ అధికారులు కొరడా ఝులిపించారు. పోలీస్ బందోబస్తు నడుమ అధికారులు ఉదయం 6 గంటల నుంచి అక్రమ నిర్మాణాలను కూల్చి వేస్తున్నారు. కావాలనే తమ ఇళ్లు నేలమట్టం చేస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఆందోళనకు దిగిన వారిని జవహర్‌నగర్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
అక్రమ నిర్మాణాలపై జీహెచ్‌ఎంసీ కొరడా.. కార్పొరేటర్ అరెస్ట్ - Naredmet corporator Sridevi arrested
యాప్రాల్‌లోని అక్రమ నిర్మాణాలను జీహెచ్‌ఎంసీ సిబ్బంది తొలగించింది. కూల్చివేతను అడ్డుకునేందుకు నేరేడ్‌మెట్ కార్పొరేటర్ వెళ్లారు. ఈ నేపథ్యంలో నేరేడ్‌మెట్ కార్పొరేటర్ శ్రీదేవిని పోలీసులు అరెస్టు చేశారు.

అక్రమ నిర్మాణాలపై జీహెచ్‌ఎంసీ కొరఢా.. కార్పొరేటర్ అరెస్ట్
కూల్చివేతలను అడ్డుకునేందుకు వచ్చిన నేరేడ్‌మెట్ కార్పొరేటర్ శ్రీదేవిని... పోలీసులు అరెస్టు చేశారు. ఇటీవల జవహర్‌నగర్‌లో సీఐపై జరిగిన దాడి దృష్ట్యా అక్రమ నిర్మాణాల కూల్చివేత వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఇదీ చదవండి :ఇద్దరి దారుణహత్య: బండరాళ్లతో మోది కిరాతకంగా చంపేశారు!