హైకోర్టు తీర్పుతో జీహెచ్‌ఎంసీ అధికారులు గణేశ్ నిమజ్జన ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. హుస్సేన్ సాగర్‌లో విగ్రహాలు నిమజ్జనం చేయొద్దన్న కోర్టు ఆదేశాలతో... నెక్లెస్ రోడ్డులో కొలను ఏర్పాటు చేశారు. రెండు క్రేన్ల సాయంతో కొలనులో గణేశుని విగ్రహాలు నిమజ్జనం చేయిస్తున్నారు. అందులో నిండిపోయిన విగ్రహాలను అధికారులు దగ్గరుండి కార్మికులతో బయటకు తీయిస్తున్నారు.
Ganesh Immersion: గణేశ్ నిమజ్జనంపై జీహెచ్‌ఎంసీ స్పెషల్ ఫోకస్ - తెలంగాణ వార్తలు
గణేశ్ నిమజ్జనంపై హైకోర్టు ఇచ్చిన ఆదేశాలతో జీహెచ్‌ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. భాగ్యనగరంలో వినాయక నిమజ్జన ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. నెక్లెస్ రోడ్డులో కొలను ఏర్పాటు చేశారు. ప్రజలంతా ఇందుకు సహకరించాలని కోరుతున్నారు.

గణేశ్ నిమజ్జన ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్న అధికారులు, గణేశ్ నిమజ్జనం 2021
కొలనులో మురికిగా మారిన నీటిని ఎప్పటికప్పుడు తొలిగించి... మళ్లీ శుభ్రమైన నీటిని నింపుతున్నట్లు అధికారులు తెలిపారు. ఖైరతాబాద్ సర్కిల్‌లో 25కొలనులు ఏర్పాటు చేశామన్న అధికారులు... వాటిలో విగ్రహాలు నిమజ్జనం చేయిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ ప్రక్రియకు ప్రజలు కూడా సహకరించాలని కోరారు.
ఇదీ చదవండి:Yadadri: నయనానందకరం... భక్తులకు త్వరలోనే సుందర యాదాద్రి దర్శనం