హైదరాబాద్ మహానగరంలో అనధికారికంగా బ్యానర్లు, ఫ్లెక్సీలు, పోస్టర్లు, కటౌట్లు, వాల్ రైటింగ్‌లకు జరిమానా విధిస్తున్నామని జీహెచ్‌ఎంసీ(GHMC) ఈవీడీఎం డైరెక్టర్ విశ్వజిత్ వెల్లడించారు. సొంత ఇంటికి టూలెట్ బోర్డు పెట్టుకుంటే ఎలాంటి జరిమానా లేదని(no fine for to-let board)... ఒకవేళ అటువంటి వాటికి జరిమానా విధిస్తే(fine for to-let board) తమ దృష్టికి తీసుకురావాలని ఆయన సూచించారు.
GHMC: 'సొంతింటి టూలెట్ బోర్డుకు జరిమానా లేదు.. ఉంటే మా దృష్టికి తీసుకురండి!
హైదరాబాద్ నగరంలోని అనధికార పోస్టర్లు, ఫ్లెక్సీలు, బ్యానర్లకు జరిమానా విధిస్తున్నట్లు జీహెచ్‌ఎంసీ అధికారులు(GHMC) వెల్లడించారు. సొంతింటి టూలెట్ బోర్డుకు ఎటువంటి జరిమానా లేదని(no fine for to-let board)... ఒకవేళ జరిమానా విధిస్తే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు.
అనధికార పోస్టర్లకు జరిమానా, ఫ్లెక్సీలకు జరిమానా
కేవలం కమర్షియల్ బిజినెస్ ఏజెంట్స్, బ్రోకర్లు, రియల్ ఎస్టేట్స్ సంబంధించిన వారు పబ్లిక్ ప్రదేశాల్లో అంటిస్తున్న పోస్టర్లకు మాత్రమే జరిమానా విధిస్తున్నామని విశ్వజిత్ వెల్లడించారు. బహిరంగ ప్రదేశాల్లో టూలెట్, కోచింగ్, రియల్ ఎస్టేట్, పాన్ కార్డు చేస్తామంటూ వెలిసిన కొన్ని ప్రచార పోస్టర్లకు జరిమానా విధిస్తున్నామని పేర్కొన్నారు.
ఇదీ చదవండి:KRMB: 50:50 నిష్పత్తిలో నీటి పంపకం సాధ్యం కాదని ఏపీ సర్కారు లేఖ
TAGGED:
hyderabad district news