రాష్ట్రంలో కరోనా కోరలు చాస్తోంది. అన్ని శాఖలకు విస్తరిస్తూ... జీహెచ్‌ఎంసీ మేయర్ కార్యాలయాన్ని కూడా తాకింది. తాజాగా మేయర్ బొంతు రామ్మోహన్ డ్రైవర్‌కు కరోనా వైరస్ సోకింది. ఉదయం నుంచి విధులు నిర్వహించిన డ్రైవర్‌కు ఎలాంటి లక్షణాలు లేకుండానే కరోనా పాజిటివ్‌గా తేలారు. ఈ ఘటనతో మేయర్ కుటుంబ సభ్యులందరినీ... హోం క్వారంటైన్ చేశారు. మరోసారి శుక్రవారం మేయర్‌కు కొవిడ్- 19 పరీక్షలు నిర్వహించనున్నారు. బుధవారం జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఒకరికి కరోనా పాజిటివ్ రాగా... అందరికీ పరీక్షలు నిర్వహించారు. మేయర్ పేషీలో రెండో కరోనా పాజిటివ్ రావడం కలవరం రేపుతోంది.
డ్రైవర్‌కు కరోనా... హోం క్వారంటైన్లో జీహెచ్‌ఎంసీ మేయర్ కుటుంబం - Ghmc meyor latest updates
డ్రైవర్‌కు కరోనా... హోం క్వారంటైన్లో మేయర్ కుటుంబం
19:33 June 11
డ్రైవర్‌కు కరోనా... హోం క్వారంటైన్లో జీహెచ్‌ఎంసీ మేయర్ కుటుంబం
Last Updated : Jun 11, 2020, 8:22 PM IST