హైదరాబాద్‌లో ప్లాస్టిక్ నిషేధం, రీసైక్లింగ్.... వ్యూహాలపై ఓ హోటల్లో ఇక్లి, యూఎన్ ఎన్విరాన్మెంట్తో కలిసి జీహెచ్ఎంసీ సమావేశం నిర్వహించింది. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ హరిచందన పాల్గొన్నారు. ప్లాస్టిక్‌ను పారదోలే దిశగా ప్రతిఒక్కరూ ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు. సమావేశంలో 'ప్లాస్టిక్ రీసైక్లింగ్ ఎలా చేయాలి... వాడకం ఎలా తగ్గించాలి' అనే అంశంపై చర్చించారు. ప్లాస్టిక్‌తో నాళాలు, మురుగు కాలువలు, వర్షం కురిసిన సమయంలో రోడ్లపై పెద్ద ఎత్తున వస్తుందని, దీనిని నిరోధించే అంశంపై చర్చించారు. రాబోయో రోజుల్లో జ్యూట్ బ్యాగ్స్, పేపర్ బ్యాగ్స్‌పై వినియోగం పెరగాల్సిన అవసరం ఉందని పలువురు అభిప్రాయపడ్డారు.
అవగాహనతోనే ప్లాస్టిక్ నిషేధం సాధ్యం: హరిచందన - ghmc zonal commissioner harichandana
ప్లాస్టిక్ నిషేధం దిశగా ప్రతిఒక్కరూ ఆలోచించాల్సిన అవసరం ఉందని జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ హరిచందన అన్నారు. హైదరాబాద్‌లో ప్లాస్టిక్ నిషేధం, రీసైక్లింగ్.... వ్యూహాలపై ఓ హోటల్లో ఇక్లి, యూఎన్ ఎన్విరాన్మెంట్ కలిసి జీహెచ్ఎంసీ నిర్వహించిన సమావేశంలో పాల్గొన్నారు.

ప్లాస్టిక్ బ్యాన్ దిశగా ఆలోచించాలి: హరిచందన