హైదరాబాద్లో కొవిడ్- 19 వ్యాప్తిని అరికట్టేందుకు జీహెచ్ఎంసీ యంత్రాంగం చర్యలు వేగవంతం చేసింది. నగర మేయర్ బొంతు రామ్మోహన్.. ఖైరతాబాద్, సికింద్రాబాద్ జోన్‌లలో పర్యటించి శానిటేషన్ పనులను తనిఖీ చేశారు. పారిశుద్ధ్య కార్మికుల రక్షణకు జీహెచ్‌ఎంసీ అందిస్తున్న గ్లౌస్‌లు, మాస్క్‌లు శానిటైజర్లు ఉపయోగించాలని మేయర్ సూచించారు.
సకాలంలో విధులకు హాజరుకాని, నిర్లక్ష్యంగా విధులు నిర్వహించే శానిటరీ వర్కర్లు అసిస్టెంట్లు సూపర్‌వైజర్‌లపై చర్యలు తీసుకోనున్నట్లు మేయర్ హెచ్చరించారు. కరోనా వైరస్ పరిస్థితులను నిరంతరం ప్రభుత్వం మానిటరింగ్ చేస్తున్నట్లు మేయర్ రామ్మోహన్ తెలిపారు. మరోవైపు నగరంలో తెరిచి ఉంచిన 66 సంస్థలను జీహెచ్‌ఎంసీ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం అధికారులు సీజ్ చేశారు.